సినిమాల్లో కాంట్రవర్సీల కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బండ్ల గణేష్.. పాలిటిక్స్ లో కూడా అంతే వివాదం అయ్యాడు. కొన్ని కారణాల వల్ల పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పిన బండ్లగణేష్.. తాజాగా తన రీ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేశారు.
సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు బండ్ల గణేష్.. ఏ విషయంలో అయినా.. తన నోటికి పనిచేప్పే బండ్ల గణేష్.. ఆతరువాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. ఇక్కడ కూడా తన మార్క్ కామెంట్లతో రచ్చ రచ్చ చేసిన బండ్ల.. కాంగ్రెస్ తరపున MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్. గతంలోనే ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటించాడు. కానీ తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్.. ఆయన రీ ఎంట్రీపై హింట్స్ ఇస్తున్నాయి.
సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ట్వీట్లు.. సినిమా ఈవెంట్స్ లో అదిరిపోయే స్పీచ్ లు .. ఊహించని విధంగా రాజకీయ ఇంటర్వ్యూలతో.. భాగా వైరల్ అయ్యారుబండ్ల్ గణేష్ కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు. పలుఅంశాలపై, సినిమాలపై పోస్టులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్స్ కొట్టిన బండ్లన్న ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈక్రమంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సీనీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం కర్నాటక ఎలక్షన్స్ హడావిడి నడుస్తోంది. కాంగ్రేస్ భారీ మెజారిటీతో అక్కడ గెలుపొందింది. అయితే ఈ రిజల్ట్ కు ముందే బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం అంటూ ట్వీట్ చేశారు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి బాయ్ బాయ్, నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా అని వరుసగా ట్విట్టర్ బాణాలు వదిలారు బండ్గ గణేష్.
కర్నాటకలో రాజకీయ హడావిడి ఉన్న టైమ్ లో.. కాంగ్రేస్ కు పాజిటీవ్ పవనాలు వీస్తున్న సమయంలో.. బండ్ల గణేష్ ఇలా ట్వీట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇక మళ్లీ బండ్ల కాంగ్రేస్ లో చేరుతారని.. ఆయన రీ ఎంట్రీ ఖాయం అనుకుంటున్నారు. అయితే బండ్ల పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి.. ఆయన జనసేనలో చేరే అవకాశం కూడా లేకపోవచ్చు అని అంటున్నారు జనాలు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈసారి బండ్ల ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.
