Asianet News TeluguAsianet News Telugu

'మా' బిల్డింగ్ వద్దు.. బండ్ల గణేష్ వండర్ఫుల్ ఐడియా, హీరోలు కూడా..

గత కొన్నేళ్లుగా మా అసోషషన్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి అభ్యర్థులు ఒకే ఎజండాతో ముందుకు వెళుతున్నారు. అదే మా అసోసియేషన్ కి కొత్త బిల్డింగ్ నిర్మాణం.

Bandla Ganesh said no to MAA building and gives wonderful idea
Author
Hyderabad, First Published Aug 19, 2021, 6:01 PM IST

గత కొన్నేళ్లుగా మా అసోషషన్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి అభ్యర్థులు ఒకే ఎజండాతో ముందుకు వెళుతున్నారు. అదే మా అసోసియేషన్ కి కొత్త బిల్డింగ్ నిర్మాణం. బరిలోకి దిగిన ప్రతి అభ్యర్థి తాను మా అసోసియేషన్ శాశ్వత బిల్డింగ్ నిర్మాణం చేపడతానని హామీలు ఇస్తూనే ఉన్నారు. 

కానీ మా బిల్డింగ్ నిర్మాణం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. ఈసారి మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సివిఎల్ నరసింహా రావు బరిలోకి దిగుతున్నారు. వీరిలో మంచు విష్ణు తాను తన సొంత ఖర్చులతో మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చాడు. 

ఇక ప్రకాష్ రాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. సినిమా బిడ్డలు పేరుతో తన ప్యానల్ మెంబర్స్ ని కూడా రెడీ చేసుకున్నారు. శ్రీకాంత్, బండ్ల గణేష్, సమీర్, బెనర్జీ, ప్రగతి లాంటి వారు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నారు. 

తాజాగా బండ్ల గణేష్ మా అసోసియేషన్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా అసోసియేషన్ కు బిల్డింగ్ అవసరమే లేదని అన్నారు. మా బిల్డింగ్ ప్రతిపాదనకు నేను వ్యతిరేకిని. దానికంటే ముందు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. 

మా అసోసియేషన్ లో చాలా మంది సభ్యులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. మా బిల్డింగ్ కోసం ఖర్చు చేసే రూ 20 కోట్లతో పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే బావుంటుంది అనే అద్భుతమైన ప్రతిపాదనని బండ్ల గణేష్ తెరపైకి తీసుకువచ్చారు. అలా చేస్తే హీరోలు కూడా తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వస్తారు అని బండ్ల గణేష్ అన్నారు. ఇప్పటికిప్పుడు మా బిల్డింగ్ కట్టకపోతే ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అని బండ్ల గణేష్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios