జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఇకపై సినిమాలు చేయనని, పాతికేళ్ల పాటు ప్రజాసేవకే కట్టుబడి ఉన్నానని సంధర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించబోతున్నట్లు ఎన్నికల ఫలితాల తర్వాత ఊహాగానాలు ఎక్కువయ్యాయి. బండ్ల గణేష్ నిర్మాతగా, బోయపాటి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 100 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్నట్లు ఇటీవల ఊహాగానాలు జోరందుకున్నాయి. 

తాజాగా బండ్ల గణేష్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఎలాంటి చిత్రాన్ని నిర్మించడం లేదని తెలిపాడు. నా నిర్మాణ సంస్థలో తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదు. సినిమా నిర్మించాలని అనుకుంటే ముందుగా నేనే అధికారికంగా ప్రకటిస్తా అని బండ్లగణేష్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ పై వచ్చిన రూమర్ తో బండ్ల గణేష్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కొన్నిరోజుల క్రితం దర్శకుడు హరీష్ శంకర్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హరీష్ శంకర్ రెండవసారి పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇస్తూ.. పవర్ స్టార్ తో సినిమా చేయడాన్ని ఇష్టపడతాను. కానీ ప్రస్తుతం ఆయనతో ఎలాంటి చిత్రం చేయడం లేదు అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న