నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల అనంతరం దాదాపు మీడియాకు దూరంగానే ఉంటున్నారు. మొన్నటి వరకు బిజినెస్ పనులతో బిజీగా ఉన్న బండ్ల గణేష్ మొత్తానికి సినిమాల్లో నటించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయంపై అనేక రకాల వార్తలు వచ్చాయి. 

అలాగే సినిమాల్లో నటించడం లేదని అవన్నీ అబద్ధాలని కూడా మరికొన్ని కథనాలు వచ్చాయి. అయితే అసలు విషయం ఏమిటో ఇప్పుడు కన్ఫార్మ్ అయ్యింది. ఆయన ఇక నుంచి నటుడిగా బిజీ కానున్నట్లు క్లారిటీ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ కమెడియన్ గా కనిపించనున్నాడు. 

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ తో సెకండ్ షెడ్యూల్ ని కొనసాగిస్తున్నాడు. ట్రైన్ ట్రావెలింగ్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే చిత్ర యూనిట్ తో బండ్ల గణేష్ కూడా కలిసి షూటింగ్ లో పాల్గొననున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. మరి ఈ యాక్టర్ ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.