బండ్ల గణేష్, ఎమ్మెల్యే రోజా ప్రేక్షకుల సాక్షిగా గొడవపడ్డారు.ఓ పొలిటికల్ డిబేట్ లో పాలొన్న వీరిద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు, లైవ్ లో తిట్టుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. బండ్ల గణేష్, రోజా బద్ద శత్రులు అయ్యారు అన్నంతగా జరిగిన ఆ గొడవ తరువాత వీరిద్దరూ కలవడం కష్టమే అని అందరూ అనుకున్నారు. 

ఐతే బండ్ల గణేష్ తాజా పోస్ట్ వీరిద్దరూ కలిసిపోయారని రుజువు చేస్తుంది. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో రోజా, బండ్ల గణేష్ కలవడం జరిగింది. ఆ వేడుకలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో బండ్ల గణేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే రోజా సెల్వమణి గారిని చాలా కాలం తరువాత కలిశానని, ఆమె ఆయురారోగ్యాలతో, విజయపథంలో దూసుకుపోవాలి కోరుకున్నారు. బండ్ల గణేష్ తాజా పోస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

రాజకీయంగా, విధానపరంగా దూరమే కానీ, వ్యక్తిగతంగా మిత్రులమే అని బండ్ల గణేష్ తాజా పోస్ట్ ద్వారా తెలియజేశారు. రోజా వైస్సార్ సీపీ ఎమ్మెల్యే కాగా, బండ్ల గణేష్ జనసేన పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు మధ్య శతృత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఇక బండ్ల గణేష్ పవన్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పవన్ అంగీకరించారని, త్వరలోనే ఆయనతో మూవీ ఉంటుందని బండ్ల గణేష్ చెప్పడం జరిగింది.