క్రేజీ ప్రొడ్యూసర్, వివాదాలతో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతారు. పలు సందర్భాల్లో బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారడం చూస్తూనే ఉన్నాం.
క్రేజీ ప్రొడ్యూసర్, వివాదాలతో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతారు. పలు సందర్భాల్లో బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న బండ్ల గణేష్..గబ్బర్ సింగ్ చిత్రంతో అగ్ర నిర్మాతగా మారారు. అప్పటి నుంచి బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడిగా మారిపోయారు.
సినిమా వేడుకల్లో మైక్ దొరికితే పవన్ గురించి మాట్లాడుతూ బండ్ల గణేష్ ఎలా పూనకంతో ఊగిపోతారో చూసాం. ఈశ్వర పరమేశ్వరా అంటూ బండ్ల గణేష్ చేసే ప్రసంగాలకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తనకి దైవ సమానం అని బండ్ల గణేష్ తరచుగా చెబుతుంటడం చూస్తూనే ఉన్నాం. కాగా నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన 52వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు సునామి తరహాలో పవన్ కి బర్త్ డే విషెస్ పోస్ట్ లు చేస్తున్నారు. బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈసారి బండ్ల గణేష్ ఈశ్వర పరమేశ్వరా అని కాకుండా కాస్త పొలిటికల్ టచ్ తో పవన్ కి విషెస్ తెలపడం విశేషం.
'నా జీవితానికి వెలుగునిచ్చిన దాత ప్రదాత, నా దైవం జననేత జనసేన అధినేత మీరు సంకల్పించిన మీ సంకల్పం చాలా గొప్పది. మీరు అనుకున్నది సాధిస్తారు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, మీ పట్టుదల మీ కృషి మీ కసి దగ్గరనుంచి చూసిన మీ భక్తున్ని మాకు మీరేంటో నాకు తెలుసు మీ మనసు ఏంటో నాకు తెలుసు విజయభవ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ ' అని బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ వైరల్ గా మారింది. బండ్ల గణేష్, పవన్ మధ్య గ్యాప్ వచ్చింది అని రూమర్స్ వచ్చాయి. దాని గురించి ప్రశ్నించగా అమ్మ నాన్నలపై కూడా ఒక్కోసారి అలుగుతుంటాం. ఇది కూడా అంతే. పవన్ పై ఒకసారి అలగాల్సి వచ్చింది. అలిగినంత మాత్రాన అమ్మానాన్నలకు దూరం కాము కదా అని బండ్ల గణేష్ తెలిపారు.
