బండ్ల గణేష్‌ ఓ డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నాడు. కొత్తగా ఓ బయోపిక్‌ని ప్రకటించాడు. ఓ స్వామిజీ జీవితం ఆధారంగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్‌ ద్వారా బండ్ల గణేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్‌ బండ్ల గణేష్‌(Bandla Ganesh). నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా డేరింగ్‌ స్టెప్స్ తో ఆయన సంచలనాలు క్రియేట్‌ చేశారు. సాహసోపేతమైన నిర్ణయాలతో తరచూ అందరిని షాక్‌కి గురి చేస్తుంటారు. సంచలన కామెంట్లతో ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా Bandla Ganesh ఓ డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నాడు. కొత్తగా ఓ బయోపిక్‌ని ప్రకటించాడు. ఓ స్వామిజీ జీవితం ఆధారంగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్‌ ద్వారా బండ్ల గణేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

గణపతి సచ్చిదానంద స్వామి వారి జీవిత చరిత్రని సినిమాగా తెరకెక్కించబోతున్నట్టు వెల్లడించారు. `అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా. ఆయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు` అని బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. ఇంకా చెబుతూ, `శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నన్ను వారి జీవిత చరిత్ర తీయమని ఆదేశించినందుకు నాకు చాలా గర్వముగా ఉన్నది... ఇది నా అదృష్టం... నేను ఒక మహా యజ్ఞం లాగా భక్తుల ముందు ఉంచుతాను` అని తెలిపారు. `ఎన్నడూ లేని ఆనందం... మరువలేని ఈ రోజు... ఒళ్ళు గగ్గురుపరిచే సన్నివేశం... స్వామీజీ తానుగా వివరించిన అయన జన్మ రహస్యం... ఇంకా ఎన్నో...` అంటూ మైసూర్‌లో స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటున్న ఫోటోని పంచుకున్నాడు బండ్ల గణేష్‌. ప్రస్తుతం బండ్ల గణేష్‌ ట్వీట్లు, స్వామిజీతో ఆయన పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

నటుడిగా మెప్పించి, నిర్మాతగా రికార్డులు సృష్టించిన బండ్ల గణేష్‌ రాజకీయాల్లో సక్సెస్‌ కాలేకపోయారు. తిరిగి నటుడిగా రీఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అంతేకాదు హీరోగానూ సినిమా చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో `డేగల బాబ్జీ`(Degala Babji) పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. తమిళంలో సక్సెస్‌ సాధించిన ఓ చిత్రానికి రీమేక్‌. వెంకట్‌ చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ అదరగొట్టింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే నిర్మాతగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు వెయిట్‌ చేస్తున్నారు బండ్ల గణేష్‌. 

also read : టీవీ ఛానెల్ పై తమన్నా లీగల్ యాక్షన్ ?

also read: క్లీవేజ్‌ అందాలతో రీతూ వర్మ సంచలనం.. బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్ల కామెంట్‌.. పూజా హెగ్డేకే షాక్