ఒక ఏడాదిలో సౌత్ నుంచి పదుల సంఖ్యలో హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో ఎవరు క్లిక్ అవుతారో చెప్పడం కష్టం. స్టార్ హీరోలతో పరిచయమైనా బ్యూటీలు కూడా కనిపించకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొదట్లో కనిపించిన బ్యూటీలలో ఇప్పుడు ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. 

అందుకు ఉదాహరణగా ఈ బాణం పిల్లనే తీసుకోవచ్చు. కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వేదిక మొదటి చూపులోనే తన అమాయకపు చూపులతో యూత్ ని ఆకర్షించింది. బాణం సినిమాలో కూడా ట్రెడిషనల్ అమ్మాయిగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బేబీ ఇప్పుడు ఫొటో షూట్స్ తో నెటిజన్స్ కు షాక్ ఇస్తోంది. 

అసలు ఆమె బాణం పిల్లేనా అన్నట్లు షాక్ అవుతున్నారు. అంతే కాకుండా ఈ వయ్యారాలు తిప్పుడు అప్పుడే తిప్పుంటే పెద్ద సినిమాల్లో ఛాన్స్ వచ్చేది కదా అని కామెంట్స్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. నివేద చివరగా నటించిన తెలుగు చిత్రం దగ్గరగా దూరంగా. సుమంత్ హీరోగా నటించిన ఆ సినిమా 2011లో వచ్చింది. అప్పుడు గ్లామర్ ని టచ్ చేయని వేదిక ఇప్పుడు మూడు పదుల వయసులో గ్లామర్ డోస్ గట్టిగా పెంచేస్తు మలయాళం తమిళ్ లో ఆఫర్స్ అందుకుంటోంది.