Asianet News TeluguAsianet News Telugu

‘న‌ర్త‌న‌శాల’ టికెట్స్..అప్పుడే అన్ని అమ్ముడయ్యాయా?

50 రూపాయలే టికెట్ కాబ‌ట్టి, బాల‌య్య అభిమానుల‌కు పెద్ద‌గా భారం అనిపించ‌టం లేదు. అందుకే `న‌ర్త‌న శాల‌` బుకింగ్స్ సూపర్ గా ఉన్నాయని సమాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్షన్నర పైగా టికెట్ల వ‌ర‌కూ తెగాయ‌ని,   `న‌ర్త‌న‌శాల‌` వ‌చ్చే స‌మ‌యానికి మ‌రో యాభై వేలు చేరే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ద్వారా  దాదాపు కోటి రూపాయ‌లు దాకా వస్తుంది.
 

Balayya Nartanasala bookings crossed one lakh jsp
Author
Hyderabad, First Published Oct 24, 2020, 8:10 AM IST

నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 24న విడుదల చేయాలని నిర్ణయించారు. ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతున్న ‘నర్తనశాల’ సినిమాను చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సిందే. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు. 50 రూపాయలే టికెట్ కాబ‌ట్టి, బాల‌య్య అభిమానుల‌కు పెద్ద‌గా భారం అనిపించ‌టం లేదు. అందుకే `న‌ర్త‌న శాల‌` బుకింగ్స్ సూపర్ గా ఉన్నాయని సమాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్షన్నర పైగా టికెట్ల వ‌ర‌కూ తెగాయ‌ని,   `న‌ర్త‌న‌శాల‌` వ‌చ్చే స‌మ‌యానికి మ‌రో యాభై వేలు చేరే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ద్వారా  దాదాపు కోటి రూపాయ‌లు దాకా వస్తుంది.
 
మరో ప్రక్క బాల‌య్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొన‌వ‌చ్చున‌ని అన్నారు. దీంతో కొంత మంది అభిమానులు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి టిక్ కొనాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.  

ఇక నందమూరి  బాలకృష్ణ కీలక పాత్రల్లో, స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘నర్తనశాల’. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో ‘నర్తనశాల’ అంటే బాలయ్యకు చాలా ఇష్టం. అందుకే దాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించారు.  ఎన్నోఎక్సపెక్టేషన్స్ మధ్య ప్రారంభమైన షూటింగ్‌ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఇప్పటికే విడుదల చేసారు. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ ఫస్ట్ లుక్ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. దీంతో మరో పౌరాణిక పాత్రలో బాలయ్యను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.  
 
ఇక గత ఏడాది ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌తో ప్రేక్షకుల్ని అలరించిన బాలయ్య ఆ తర్వాత ‘రూలర్’లో కనిపించారు. ప్రస్తుతం ఆయన 106వ చిత్రం పనులు జరుగుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ని  సైతం విడుదల చేశారు. నయనతార, శ్రియ ఇందులో హీరోయన్స్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios