‘కేజీఎఫ్‌2’లో బాలయ్య.. అసలు నిజం ఇది!

‘కేజీఎఫ్ 2’ సినిమా క్యాస్ట్​ అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే యష్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్​ తదితరుల పేర్లతో పాటు బాలయ్య పేరు కూడా ఉంది. ఇనాయత్ ఖలీ పాత్రలో ఆయన నటిస్తున్నారని గూగుల్ చూపిస్తోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలన అది వైరల్ గా మారింది. 

Balayya in Kfg 2 movie? jsp

సింహా, లెజెండ్ వంటి సినిమాల ద్వారా బాలయ్య మాస్ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. అయితే ‘కేజీఎఫ్ 2’ లాంటి ఊర మాస్ సినిమాలో బాలయ్య నటిస్తే ఎలా ఉంటుందనే ఊహే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది కదా. నిజమైతే నందమూరి అభిమానుకు అయితే పూనకాలే. అయితే బాలయ్య ఈ సినిమాలో నటిస్తూనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజంగా బాలయ్య వంటి స్టార్ నటిస్తే అఫీషియల్ గా టీమ్ ప్రకటించేది కదా..అనే సందేహం చాలా మందిని తొలిచేస్తోంది. మరో ప్రక్క ‘కేజీఎఫ్ 2’లొ  హీరో యష్​ కదా బాలయ్య ఇందులో ఉన్నారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

అయితే నిజానికి ఈ వార్త చిత్రయూనిట్  చెప్పింది కాదు. మీడియా కల్పించి రాసింది కాదు. గూగుల్‌ సెర్చ్‌లో ‘కేజీఎఫ్‌2’ అని వెతికితే ఆ సినిమాలో నటీనటుల లిస్ట్ లో మన బాలకృష్ణం పేరును కూడా చూపిస్తోంది. అంతేకాదు.. బాలయ్య పోషించబోయే పాత్ర పేరు ‘ఇనాయత్‌ ఖలీల్‌’ అని కూడా పెట్టింది. ఈ గాలి వార్త ఎలా గూగుల్ లోకి చేరిందో తెలియలేదు. మీకు ఆ వార్తను చూడాలంటే ఒకసారి గూగుల్‌కు వెళ్లి వెతికి ప్రయత్నించండి. ఇంతకీ కేజీఎఫ్ లో లో ఇనాయత్‌ఖలీల్‌ పాత్ర ఉందా...ఉంటే కనుక ఎవరుపోషిస్తున్నారోతెలియాలంటే చిత్ర టీమ్ చెప్పాలి.
 
ఇక కన్నడ స్టార్‌ యశ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ‘కేజీఎఫ్‌:ఛాప్టర్‌2’ తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌1’కు కొనసాగింపు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. సీనియర్‌ నటి రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios