భళా! బాలయ్య, బోయపాటి కాలుక్యులేషన్స్ ..

అఖండ విషయంలోనూ బాలయ్య కొత్త లెక్కలతోనే సినిమా మొదలెట్టాడు. నిర్మాతపై భారం పడకుండా ఉండటం కోసం .. బాలకృష్ణ బడ్జెట్ కంట్రోల్ చేయాలనుకున్నారు. అందుకోసం ఆయన చెయ్యాల్సింది చేస్తున్నాడట. 

Balayya and Boyapati Takes A Calculated Risk with Akhanda jsp

సినిమా అంటేనే అనేక కాలుక్యులేషన్స్..లెక్కలు. బడ్జెట్,డేట్స్ అన్ని లెక్కలేసుకుని ముందుకెళ్లాల్సినవే. అయితే ఒక్కోసారి లెక్కలు తప్పుతూంటాయి. పెద్ద హీరోలు లెక్క చేయరు. పెద్ద డైరక్టర్స్ లెక్కలేస్తుంటే విసుక్కుంటారు. కానీ బాలయ్య ఒకసారి సినిమా కమిటైతే నిర్మాత,దర్సకుడు లెక్కలు ఫాలో అవుతారు. తన కెరీర్, క్రేజ్ ఆయనకు క్లియర్ గా తెలుసు. ఏ టైమ్ లో ఎంతవరకూ లెక్కలేసుకోవాలో ఆ కాలుక్యులేషన్ మైండ్ లో పెట్టుకుంటాడు. అందుకే ఆయనతో సినిమా అంటే అందరూ ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు  అఖండ విషయంలోనూ బాలయ్య కొత్త లెక్కలతోనే సినిమా మొదలెట్టాడు.

నిర్మాతపై భారం పడకుండా ఉండటం కోసం .. బాలకృష్ణ బడ్జెట్ కంట్రోల్ చేయాలనుకున్నారు. అందుకోసం ఆయన చెయ్యాల్సింది చేస్తున్నాడట. అంటే  రెమ్యునేషన్ ఎక్కువగా తీసుకోకుండా కేవలం 7 కోట్లే సరిపెట్టుకున్నారట. సినిమా హిట్టయ్యాక లాభాలు తీసుకుంటాను అన్నారట. అలాగే బోయపాటి కూడా ప్రస్తుతానికి ఎలాంటి రెమ్యునేషన్ లేకుండా ఈ సినిమా చేస్తున్నాడని టాక్. దాంతో నిర్మాత వీళ్ళు కు ఇవ్వాల్సిన సొమ్ముని సినమాపై పెట్టగలుగుతున్నారట. ఇదంతా గత రెండు రోజులుగా మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. ఎంతవరకూ నిజముందో తెలియాలి. నిజమైతే మాత్రం ఇద్దరూ గ్రేటే.

  ‘అఖండ’ లో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయన్స్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఇంటర్నెట్ లో సంచలనాలు సృష్టిస్తోంది. శరవేగంగా 50 మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పిన డైలాగులు, ఆయన గెటప్‌  స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. 

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూస్తారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణతో చేస్తున్న ‘అఖండ’పై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. టీజర్‌కి ఇంతగా ఆదరణ దక్కడం సంతృప్తినిచ్చింది. కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి’’అన్నారు.

 నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది టీజర్‌. మా సంస్థలో రూపొందుతున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రమిది. పరిస్థితులు కుదుటపడ్డాక విడుదల చేస్తాం’’ అన్నారు. జగపతిబాబు, శ్రీకాంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, సంగీతం: తమన్‌.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios