నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం ఒంగోలులో కొనసాగుతోంది. ఈవెంట్ లో భాగంగా Veera Simha Reddy Trailerను తాజాగా విడుదల చేశారు.  

నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్, శ్రీలీల, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్న్ ను చిత్రయూనిట్ జోరుగా నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు గ్రౌండ్ లో గ్రాండ్ ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన బీ గోపాల్ చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం పవర్ ఫుల్ ట్రైలర్ ను విడుదల చేశారు. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు దుమ్ములేచిపోయాయి. గాడ్ మాసెస్ గా బాలయ్య వీరసింహారెడ్డి గర్జించారు. ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఇక బాలయ్య డాన్స్, యాక్షన్ నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు,టీజర్, గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రామీసింగ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా రావడమే తర్వాయి.. బాలయ్య అభిమానులు సంబురాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘అఖండ’ తర్వాత ‘వీరసింహారెడ్డి’ రాబోతుండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కి రెడీగా ఉంది. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జవనరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Scroll to load tweet…