దీపావళి స్పెషల్‌గా బసవతారకం ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాను తన ముగ్గురు పిల్లలు మోక్షజ్ఞ, తేజస్విని, బ్రహ్మణిలతో కలిసి ఉన్నాడు. అయితే తన పిల్లలతో తాను ఉండటంలో విశేషం ఏం లేదు. కానీ తాజాగా ఫోటోలో కనిపిస్తున్నట్టు ఉన్న లుక్కే విశేషంగా మార్చింది. 

ఇందులో బెడ్‌పై బాలకృష్ణ పడుకోగా, ఆయనపై ముగ్గురు పిల్లలున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ ఉండగా, ఆ తర్వాత బ్రాహ్మణి, తేజస్విని బాలకృష్ణపై కూర్చోవడం విశేషంగా చెప్పొచ్చు. చిన్ననాటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ అభిమాన నటుడిని, వారి పిల్లలను చిన్నప్పుడు ఇలా చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి గురవుతున్నారు. 

బ్రాహ్మణి ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ నటనా ఎంట్రీ కోసం ప్లాన్‌ జరుగుతుంది. గత మూడేళ్లుగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ జరుపుకుంటోంది.