Asianet News TeluguAsianet News Telugu

'భగవంత్ లాల్ కేసరి' గా బాలయ్య, కేక పెట్టించే లుక్ తో ...

 అఖండ టైటిల్ శివుడును గుర్తు చేస్తే... ఈ NBK108 విష్ణుమూర్తి ని గుర్తు చేసేలా ఉండాలని భావిస్తున్నారట. ఈ పాత్ర అడిగితే వెంటనే వచ్చి రక్షించే పాత్ర అని తెలుస్తోంది. దాంతో విష్ణు మూర్తి నామాలలో ఒక దానిని తీసుకుని పెట్టబోతున్నట్లు సమాచారం. 

Balakrishna will be called Bhagawanth lal Kesari in #NBK108
Author
First Published May 30, 2023, 12:26 PM IST


బాలయ్య 107వ సినిమాగా వచ్చిన 'వీరసింహారెడ్డి' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా 100  రోజులను పూర్తి చేసుకుంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.  బాలయ్య సూచనపై ఈ చిత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం గురించి ఓ లీక్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో బాలయ్యపేరు 'భగవంత్ లాల్ కేసరి'  అని తెలుస్తోంది. అలాగే బాలయ్య లుక్ కూడా టెర్రిఫిక్ గా ఉండబోతోందని సమాచారం. 

అయితే సినిమాకు టైటిల్ ఏంటనేది ఇంకా ఫైనల్ కాలేదు. అఖండ టైటిల్ శివుడును గుర్తు చేస్తే... ఈ NBK108 విష్ణుమూర్తి ని గుర్తు చేసేలా ఉండాలని భావిస్తున్నారట. ఈ పాత్ర అడిగితే వెంటనే వచ్చి రక్షించే పాత్ర అని తెలుస్తోంది. దాంతో విష్ణు మూర్తి నామాలలో ఒక దానిని తీసుకుని పెట్టబోతున్నట్లు సమాచారం. 

ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొంటోంది. పెళ్లి తర్వాత కాజల్ పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో చేస్తోన్న ‘ఇండియన్ 2’ మూవీలో చేస్తోంది. ఇక ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. బాలయ్య, కాజల్ అగర్వాల్ కూతురిగా ఆమె కనిపించనుంది. ఇప్పటికే ఈమెపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. జైలుకు వెళ్లొచ్చిన తండ్రి కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో బాలయ్య సినిమాలు తెరకెక్కగా, తొలిసారి తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు.  ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 
 
అలాగే  ఈ సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు. మొదటి నుంచి చివరివరకూ ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios