అందరు హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్న నేపథ్యంలో బాలయ్య కూడా ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర విడుదల తేదీని ప్రకటించాలని నిర్ణయించారు.

నందమూరి బాలకృష్ణ కూడా తన ఫ్యాన్స్ కి గుడ్‌ చెప్పాలని నిర్ణయించారు. అందరు హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్న నేపథ్యంలో బాలయ్య కూడా ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర విడుదల తేదీని ప్రకటించాలని నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.36 నిమిషాలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్ ట్వీట్‌ చేసింది. 

Scroll to load tweet…

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. గతంలో `సింహా`, `లెజెండ్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత బాలయ్య ఆ స్థాయి హిట్‌ దక్కలేదు. `గౌతమిపుత్ర శాతకర్ణి` మెప్పించినా కలెక్షన్ల పరంగా అంతగా సత్తచాటలేదు. దీంతో తాజా సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాలని, వరుస ఫ్లాప్‌ల నుంచి బయటపడాలని బాలయ్య భావిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రగ్యా జైశ్వాల్‌ నటిస్తుంది. మరో హీరోయిన్‌ కి కూడా ఛాన్స్ ఉందని టాక్‌. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు. బహుశా టైటిల్‌పై కూడా ఈ మధ్యాహ్నం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. ఓ పాత్రలో అఘోరగా కనిపిస్తారట. గతంలో ఎన్నడూ లేని విధంగా గుండుతో బాలయ్య కనిపిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్‌ వంటి సీనియర్‌ హీరోలు, మహేష్‌, పవన్‌, రవితేజ వంటి హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. ఇప్పుడు బాలయ్య కూడా రంగంలోకి దిగబోతుండడంతో పోటీ తప్పేలా లేదు.