ఫ్సాన్స్ తో తొొలి ఆటను తిలకించిన బాలకృష్ణ కుకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో 4గంటలకు షో
శాతవాహన సామ్రాజ్యాధినేత గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటించిన వందో చిత్రం కూడా ఇదే అని తెలిసిందే. తన వందో సినిమాను అబిమాన ప్రేక్షకులతో కలిసి తిలకించారు బాలయ్య. భ్రమరాంభ థియేటర్ లో ముందస్తు షో లో తెల్లవారు జామునే తన సినిమాను వీక్షించారు.
స్వయంగా బాలయ్య తమతో కలిసి సినిమా చూడటానికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలకృష్ణ తో పాటు అనేక మంది సినీ ప్రముఖులు ఆ షో కి హాజరై సినిమాను వీక్షించారు. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివలతో పాటు హీరో నారా రోహిత్ కూడా శాతకర్ణి సినిమా తిలకించారు.
