సోషల్ మీడియా కామెంట్లను పెద్దగా పట్టించుకోని బాలయ్య అలా కామెంట్లను పోస్ట్ చేసేవారిని 'అన్ స్టాపబుల్' వేదికగా హెచ్చరించారు. కొంతమంది వెధవలు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

గత కొద్ది రోజులుగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన ఆన్స్టాపబుల్ టాక్ షో తో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆయన మధ్యలో తన పర్శనల్ విషయాలు కూడా ముచ్చటిస్తున్నారు. మనస్సులో మాటలు చెప్పేస్తున్నారు. తాను చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి ఆయన అక్కడితో ఆ టాపిక్ వదిలేస్తారు. ఆ తరువాత ఆ విషయంపై ఎంత రచ్చ జరిగినా తనది కాదన్నట్లు పట్టించుకోరు. అలాగే సాధారణంగా సోషల్ మీడియా కామెంట్లను పెద్దగా పట్టించుకోని బాలయ్య అలా కామెంట్లను పోస్ట్ చేసేవారిని 'అన్ స్టాపబుల్' వేదికగా హెచ్చరించారు. కొంతమంది వెధవలు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఇవాళ ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు తెలియదు .. లొకేషన్ తెలియదు .. అడ్రెస్ ఉండదు. చాలా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. ఏంటివన్నీ. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ. కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు .. పేరు చెప్పుకోవడానికి ధైర్యంలేని ఈ వెధవలను క్షమిద్దాం. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం 'అన్ స్టాపబుల్' అవుతాం" అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ మాటలు హాట్ టాపిక్ గా మారాయి. 

ఇక బాలయ్య తాజా చిత్రం విషయానికి వస్తే...‘క్రాక్‌’తో సూపర్‌హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni). ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని పట్టాలెక్కించనున్నారు. త్వరలో రెగ్యూలర్‌ షూట్‌ ప్రారంభించనున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారని చిత్ర టీమ్ బుధవారం అధికారికంగా స్పష్టం చేసింది. టీమ్‌లోకి ఆమెకు స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేసింది. మరోవైపు, ‘క్రాక్‌’లో జయమ్మగా వరలక్ష్మి (Varalakshmi) నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. వాస్తవిక ఘటనలు ఆధారంగా చేసుకుని ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్‌ సందడి చేయనున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్‌ ఈ సినిమాలో మరో కీలకపాత్రలో కనిపించనున్నారు.