నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. టైటిల్‌ని కూడా ప్రకటించబోతున్నారు.

బాలకృష్ణ(Balakrishna) సక్సెస్‌ జోరులో ఉన్నారు. సినిమాల విషయంలోనూ జోరు పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన `వీరసింహారెడ్డి`(Veerasimha Reddy) చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. అనిల్‌ రావిపూడి(Anil Ravipudi)తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. NBK108 చిత్రం రేపు(గురువారం)ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 9.36గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 

రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా రేపటి నుంచే ప్రారంభం కానుందట. అందుకోసం భారీగా సెట్‌ వేశారని సమాచారం. అంతేకాదు ఈ సినిమా టైటిల్‌ని కూడా రేపే ప్రకటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి `రామారావు గారు` అనే టైటిల్ ని అనుకుంటున్నారని సమాచారం. షైన్‌ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట. బాలయ్య నటించిన `అఖండ` చిత్రం సుమారు 150కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో బాలయ్య మార్కెట్‌ ఓపెన్‌ కావడం, పాన్‌ ఇండియా ట్రెండ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో బాలయ్యపై భారీగా ఖర్చు చేసేందుకు నిర్మాతలు ఆసక్తిగానే ఉన్నారట. ఏకంగా తొంబై కోట్ల బడ్జెట్‌తో సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం.

మాస్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అనిల్‌ రావిపూడి ఈ కథని సిద్ధం చేశారట. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి తన పంథాని పూర్తిగా మార్చి, తనలోని మాస్‌ డైరెక్టర్‌ని బయటకు తీసుకురాబోతున్నారట. అనిల్‌ మాస్‌ సినిమా చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించబోతున్నారట. ఇందులో బాలయ్య పాత్ర సరికొత్తగా ఉంటుందట. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన పాత్ర ఉండబోతుందని టీమ్‌ తెలిపింది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తుండగా, శ్రీలీలా కీలక పాత్ర(కూతురుగా) పోషిస్తుంది. సి రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, రాజీవ్‌ ఆర్ట్ డైరెక్టర్‌గా, వి వెంకట్ ఫైట్‌ మాస్టర్‌గా వ్యవహరించనున్నారు. 

ఇదిలా ఉంటే ఇందులో బాలయ్యకి జోడీగా ప్రియాంక జవాల్కర్‌ నటిస్తుందట. అలాగే ప్రియమణి కూడా ఆయన సరసన కనిపించబోతుందని సమాచారం. దీంతోపాటు నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో అంజలి నటించనున్నారట. ఇలా సినిమా మొత్తం హీరోయిన్లతో నింపేయబోతున్నార అనిల్‌ రావిపూడి. గ్లామర్‌ డోస్‌ గట్టిగానే మేళవిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌ టాక్‌.