నటి సార్వభౌముడు, తండ్రి ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. 

నటి సార్వభౌముడు, తండ్రి ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన సొంత గాత్రంతో `శ్రీరామదండకం` శ్లోకాన్ని ఆలపించారు. ఈ వీడియోని తాజాగా శుక్రవారం విడుదల చేశారు. చాలా కఠినమై, సంక్షిష్టమైన పదాలను కూడా బాలయ్య అవలీలగా ఆలపించి మెస్మరైజ్‌ చేశారు. విడుదలైన ఈ పాట ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, `వెండి తెరమీదున్న కథానాయికుడిని ఆబాల గోపాలానికి ఆరాధ్యున్ని చేసిన ఆది అధినాయకుడు...` అంటూ ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని కీర్తించారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తాను పాడిన `శ్రీరామదండకం` పాటని ఆ తారక రాముడికి అంకితమని తెలిపారు. 

YouTube video player

గతేడాది తన బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ `శివ శంకరీ..` అనే పాటని ఆలపించి ఫ్యాన్స్ ఫిదా చేశారు. మరి ఈ సారి తండ్రి జయంతి సందర్భంగా మరో పాట ఆయన నుంచి రావడం విశేషం. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. `సింహా`, `లెజెండ్‌` చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది కరోనా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేయనున్నారు.