బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `బీబీ3` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌, చిన్న గ్లింప్స్, విడుదల తేదీ తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ కన్ఫమ్‌ చేయలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఎట్టకేలకు చిత్ర బృందంలో చలనం కలిగింది. ఈ ఉగాదికి ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఉగాది  సందర్బంగా ఈ నెల 13న మధ్యాహ్నం 12.33 గంటలకు ఈ చిత్ర టైటిల్‌ని ప్రకటించనున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్‌. దీంతో బాలయ్య అభిమానుల్లో జోష్‌ నింపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి పలు పేర్లు ఆ మధ్య సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో ప్రధానంగా `గాడ్‌ఫాదర్‌` అనే టైటిల్‌ని వైరల్‌గా మారింది. చిత్ర కథకి, బాలయ్య ఇమేజ్‌కి ఈ టైటిల్‌ పర్‌ఫెక్ట్ అనే టాక్‌ వినిపించింది. మరి ఎలాంటి టైటిల్‌ పెడతారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. అందుకే `బీబీ3` వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. గతంలో వీరి కాంబినేషన్‌లో `సింహా`, `లెజెండ్‌` చిత్రాలు వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో తాజా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్య సైతం ఈ సినిమాతో సక్సెస్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మే 28న విడుదల కానుంది.