సారాంశం

బాలయ్య బాబు కొత్త అవతారం ఎత్తాడు. ఎన్నడూ లేని విధంగా.. చాలా కాలం తరువాత క్లీన్ షేవ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. అంతే కాదు ఈ లుక్ కు కారణం ఏంటో కూడా క్లారిటీ ఇచ్చాడు బాలకృష్ణ. 


తాజాగా హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య.  వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలకృష్ణ.. నెక్ట్స్ సినిమాలవిషయంలో కూడా అదే స్పీడ్ ను.. జోష్ ను చూపిస్తున్నాడు. రీసెంట్ గా బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో బాలయ్య ప్రత్యేకంగా ఆకర్షించారు. ఆయన మాటలే కాదు.. ఆయన లుక్ కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఈ ఈవెంట్ లో బాలకృష్ణ నయా లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ మధ్య ఆయన ఎప్పుడు చూసినా  గడ్డంతో కనిపించారు. బాలయ్యను చాలా కాలంగా గడ్డంతో.. అది కూడా సాల్ట్ పెప్పర్ లుక్ లో చూసీ చూసీ అలవాటుపడ్డ ఫ్యాన్స్ కు ఆయన క్లీన్ షేవ్ తో కనిపించగానే.. అభియానులు దిల్ ఖుష్ అయ్యారు. కొత్త అవతారంలో బాలయ్యను చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. 

ఇక బాలకృష్ణ ఇలా  క్లీన్‌షేవ్‌లో కనిపించడంపై  ఆయనే స్యయంగా స్పందించారు. ఈ విషయం గురించి బాలయ్య మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత గడ్డం తీయడంతో తనను తానే గుర్తుపట్టలేకపోయానని నవ్వుతూ చెప్పారు. గడ్డం తీయడం వెనక ఓ కారణం కూడా ఉంది అన్నారు నటసింహం. తాను  బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని, ఈ సినిమా కోసం ఇలా స్పెషల్ లుక్ లో కనిపించబోతున్నట్టు వెల్లడించారు. అందుకే ఇలా  గడ్డం తీసినట్టు చెప్పారు.  

వచ్చే నెలలో బాబీతో బాలయ్య సినిమా  సెట్స్‌పైకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.  గడ్డం తీసిన తర్వాత అద్దంలో చూసుకుని చాలాసేపటి వరకు తనను తానే గుర్తుపట్టలేకపోయానని చమత్కరించారు. కాగా, భగవంత్ కేసరి సినిమాలో తనతో కలిసి నటించిన నటి కాజల్ కూడా మరో సినిమా చేస్తున్నారని, దానిపేరు సత్యభామ అని బాలకృష్ణ రివీల్ చేశారు.