కన్నడలో మాట్లాడి అదరగొట్టిన బాలయ్య.. పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రశంసలు.. `వేద` ఈవెంట్‌లో రచ్చ..
శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన `వేద` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన కాసేపు కన్నడలో మాట్లాడి అలరించారు.

బాలకృష్ణ కన్నడ భాషలో మాట్లాడారు. తనకు రాకపోయినా పేపర్‌లో రాసుకుని మరీ కన్నడలో మాట్లాడటం విశేషం. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన శివరాజ్‌కుమార్ `వేద` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన కన్నడలో కాసేపు మాట్లాడి శివరాజ్‌కుమార్‌తోపాటు టీమ్ అందరిని సర్‌ప్రైజ్ చేశారు. అయితే మొదట తెలుగులోనే ప్రసంగించారు బాలయ్య. టీమ్ అందరికి పేరు పేరున అభినందనలు తెలిపారు.
దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించిన బాలయ్య, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌తోపాటు హీరోయిన్‌ని కూడా ప్రత్యేకంగా సంభోదించారు. హీరోయిన్‌పై సెటైర్లు, కామెంట్లు చేస్తూ నవ్వులు పూయించారు. అలాగే శివరాజ్‌కుమార్‌ని తమ్ముడిగా, ఆయన భార్యని మరదలు అంటూ సంభోదించడం హైలైట్‌గా నిలిచింది. చాలా కూల్‌గా మాట్లాడిన బాలయ్య ఎలాంటి వివాదాలకు తావులేకుండా తన స్పీచ్ ఉండేలా చూసుకున్నారు. మధ్య మధ్యలో కాస్త నోరు జారబోయినా కంట్రోల్ చేసుకున్నారు.
ఈక్రమంలో ఆయన చిత్ర బృందానికి కన్నడలో అభినందనలు తెలిపారు. పేపర్‌లో రాసుకుని మరి స్టేజ్‌పై చూస్తూ కన్నడలో మాట్లాడటం విశేషం. దీంతో పక్కనే ఉన్న శివరాజ్ కుమార్ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, సినిమాలో నటించిన ప్రతి ఒక్క నోటెడ్ ఆర్టిస్టు పేరుని గుర్తు చేస్తూ మాట్లాడటం మరో విశేషం. మనం ఏదో చేసి గొప్పలు చెప్పుకుంటాం. కానీ పునీత్ రాజ్‌కుమార్(శివరాజ్‌కుమార్ తమ్ముడు) ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకోలేదని, ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారని తెలిపారు. శివరాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఆయన అభినందనలు తెలిపారు.
మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారని, ఇప్పటికే చాలా సినిమాలు అలా ఆదరణ పొందుతున్నాయన్నారు. `వేద` కన్నడలో పెద్ద విజయం సాధించిందని, ఇక్కడ కూడా ఆదరణ పొందుతుందని, తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు. మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతాయని వెల్లడించారు. స్టేజ్‌పై ఆయన సందడి చేశారు. తనదైన స్టయిల్‌లో రచ్చ చేస్తూ నవ్వులు పూయించారు.
ఇదిలా ఉంటే ఇందులో శివరాజ్ కుమార్ సినిమాలోని `పుష్ప` పాటని పాడి ఆకట్టుకున్నారు. అంతేకాదు దానికి తగ్గ స్టెప్పులు కూడా వేశారు. ఇక కన్నడలో రూపొందిన `వేద` చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. డిసెంబర్ 23న అక్కడ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాదాపు నెలన్నర తర్వాత తెలుగుతోపాటు ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానుంది. దీనికి హర్ష దర్శకత్వం వహించగా, శివరాజ్ కుమార్‌కి జోడీగా ఘనవి లక్ష్మణ్ నటించింది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. గీతాశివరాజ్‌కుమార్ నిర్మాత.