నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ జనరేషన్‌ హీరోగా ఎన్టీఆర్‌, కళ్యాన్ రామ్ లు సత్తా చాటారు. మరికొంత మంది హీరోలు వచ్చినా పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఎన్టీఆర్‌ ఒక్కడే టాప్‌ హీరోగా సత్తా చాటగా, కళ్యాణ్ రామ్‌ తనకంటూ కొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. అయితే నందమూరి వారసుడిగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా సమయంలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపించాయి. క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, బోయపాటి నందమూరి వారసుడిగా కోసం అద్భుతమైన కథ రెడీ చేశాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ మోక్షజ్ఞ మీడియాలో కనిపించిన ప్రతీసారి ఆ వార్తలన్ని ఉత్తిదే అని తేలిపోయింది. సినిమాలకు ఏ మాత్రం సిద్ధంగా లేడు మోక్షజ్ఞ.

ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన నందమూరి బాలకృష్ణ మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించాడు. దీంతో నందమూరి వారసుడి తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టే అని అంతా భావించారు. కానీ తాజాగా బాలయ్య పుట్టిన రోజు వేడులకలో పాల్గొన్న మోక్షజ్ఞను చూస్తే అవన్ని వట్టి మాటలే అనిపిస్తుంది. మోక్షజ్ఞ సినిమాలకు ఏ మాత్రం సిద్ధంగా లేడు.

బాలయ్యకు కేక్ తినిపిస్తున్న ఫోటోలో మోక్షు భారీకాయంతో చబ్బీగా కనిపిస్తున్నాడు. అంటే మోక్షజ్ఞగా హీరోయిక్‌గా కనిపించడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో వర్క్‌ అవుట్ చేస్తే గాని మోక్షజ్ఞ ఫిట్ గా కనిపించడు. అందుకు కనీసం ఏడాది సమయమన్నా పడుతుంది. దీంతో ఈ లుక్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే కష్టమే బాలయ్యా అంటున్నారు ఫ్యాన్స్.