సంక్రాంతి పండుగ (Sankranthi 2022) పురస్కరించుకుని లైగర్ మూవీ టీమ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి షోకి రావడం జరిగింది. వీళ్ళను కూడా బాలయ్య తనదైన శైలిలో ఆడుకున్నట్లు తెలుస్తుంది.

అన్ స్టాపబుల్ టాక్ షోతో బాలయ్య మొదటిసారి హోస్ట్ గా మారారు. బుల్లితెరపైకి అడుగుపెడుతూనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్ స్టాపబుల్(Unstoppable) రికార్డులకు ఎక్కింది. ఫిల్టర్స్ లేకుండా, డిప్లమాటిక్ సమాధానాలకు దూరంగా బోల్డ్ ప్రశ్నలు, ఆన్సర్స్ తో అన్ స్టాపబుల్ టాక్ షో సాగుతుంది. సెలబ్రిటీ ఎవరైనా బాలయ్య వాళ్ళను అడిగే తీరు వేరుగా సాగుతుంది. హోస్ట్ అయినప్పటికీ తన గురించి కూడా కొన్ని వ్యక్తిగత విషయాలు బాలయ్య చర్చకు తీసుకురావడం జరుగుతుంది. 

తాజాగా సంక్రాంతి పండుగ (Sankranthi 2022) పురస్కరించుకుని లైగర్ మూవీ టీమ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి షోకి రావడం జరిగింది. వీళ్ళను కూడా బాలయ్య తనదైన శైలిలో ఆడుకున్నట్లు తెలుస్తుంది. ఏదో షోకి వచ్చినోళ్లను మొక్కుబడిగా నాలుగు ప్రశ్నలు అడగడం, వాళ్ళు డిప్లొమాటిక్ గా సమాధానాలు చెప్పడం, ఇవన్నీ నావల్ల కాదు. నా షోకి వచ్చినోళ్ళతో ఆడుకుంటా.. అంటూ బాలయ్య వాళ్ళను భయపెట్టే ప్రయత్నం చేశారు. 

ఇక షోలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన పంచింగ్ బ్యాగ్ ని తన్నాలని విజయ్ ని కోరాడు బాలయ్య. విజయ్ పంచింగ్ బ్యాగ్ ని తన్నడం జరిగింది. మరో టాస్క్ గా... నా మొదటి సినిమా పేరు చెప్పాలని అడిగాడు. దీనికి విజయ్ దేవరకొండ వద్ద ఆన్సర్ లేదు. సమాధానం చెప్పడానికి తడబడుతుంటే... ఆడియన్స్ లో నుండి ఒకరు తాతమ్మ కల అంటూ సమాధానం చెప్పారు. అప్పుడు విజయ్ ఆన్సర్ చేశాడు. 
విజయ్ దేవరకొండకు ఆన్సర్ చెప్పన ప్రేక్షకుడిపై బాలయ్య మండిపడ్డారు. వాడు ఎవడో నా చేతిలో ఐపోయాడంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా... ఈ ఆసక్తికర విషయాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. 

ప్రస్తుతం బాలయ్య (Balakrishna)ప్రకాశం జిల్లా చీరాల, కారంచేడు ప్రాంతంలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం బావగారైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నివాసానికి బాలకృష్ణ రావడం జరిగింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య కారంచేడులో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. త్వరలో ఆయన లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బాలకృష్ణ మరోసారి పోలీస్ గా కనిపిస్తాడని వినికిడి. 

అఖండ (Akhanda)మూవీతో బాలయ్య సాలిడ్ కమ్ బ్యాక్ అయ్యాడు. అఖండ ఆయనను పరాజయాలనుండి బయటపడేయడమే కాకుండా... మరపురాని విజయాన్ని అందించింది. అఖండ రూ. 115 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో అఖండ వసూళ్ల జోరు తగ్గలేదు. సంక్రాంతికి బడా చిత్రాలు విడుదల వాయిదా పడింది. దీంతో ప్రేక్షకులు అఖండ చిత్రంవైపు మొగ్గు చూపుతున్నారు. 

YouTube video player