దేశంలో సినిమా సందడికి బ్రేక్ పడి ఐదు నెలలు అవుతుంది. కరోనా కారణంగా మార్చి నెలలో మొదలైన లాక్ డౌన్ పూర్తి స్థాయిలో విరమించలేదు. థియేటర్స్ బంధ్ కారణంగా చిత్రాల విడుదల ఆగిపోయింది. కరోనా భయంతో షూటింగ్స్ అపి వేయడం జరిగింది. బాలీవుడ్ లో ఇప్పుడే మెల్లగా షూటింగ్స్ మొదలయ్యాయి. షూటింగ్స్ లో పాటించవలసిన భద్రతా నియమాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. టాలీవుడ్ లో కూడా త్వరలో షూటింగ్స్ మొదలుకానున్నాయి. రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ సెప్టెంబర్ 2నుండి షూటింగ్ మొదలుపెడుతున్నట్లు తెలిపారు. 

కాగా ఇదే విషయంపై హీరో బాలకృష్ణను అడుగగా ఆయన స్పందించారు. త్వరలోనే అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు. ఇక కరోనాకు భయపడి ఎవరూ ఆత్మ హత్యలు చేసుకోవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ప్లాస్మా దానం చేయడం వలన అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. కావున కరోనా బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని కోరుకోవడం జరిగింది. ఇక కరోనా క్రైసిస్ నేపథ్యంలో బాలయ్య దాదాపు రెండు కోట్ల వరకు అనేక రూపాల్లో దానం చేశారు. 

కాగా బాలయ్య తన లేటెస్ట్ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో సందడి చేయనున్నారు. విజయాల పరంగా వెనుకబడిన బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

"