Asianet News TeluguAsianet News Telugu

ఇంకా కాక తీరలేదు.. ‘అన్ స్టాపబుల్’తో అమ్మ మొగుడిని చేశా.. ‘వీరసింహారెడ్డి’ ఈవెంట్ లో బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్!

నందమూరి నటసింహాం బాలకృష్ణ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఒంగోలులో విజయవంతంగా జరిగింది. వేదికపై బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్ కు అభిమానులు హోరెత్తారు. కాగా, బాలయ్య కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Balakrishna powerful speech at Veera Simha Reddy Pre Release Event!
Author
First Published Jan 6, 2023, 10:42 PM IST

నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) నటించిన అవుట్ అండ్ అవుట్  యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న  విషయం తెలిసిందే. మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు మార్కెట్ రోడ్ లోని అర్జున్ ఇన్ ఫ్రా  గ్రౌండ్ లో గ్రాండ్ గా విజయవంతంగా కొనసాగింది. 

 వేదికపై బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనను రాయలసీమకే పరిమయ్యాయని అంటున్నారని, అదికాదన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో తెలంగాణకు సంబంధికుడిగా ఉన్నానని, అలాగే పల్నాడు, బొబ్బిలి, రాయలసీమ చిత్రాల్లో నటించి అన్నీ కులాలు, మతాలు, వర్గాల వాడిగానే భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. అన్ని తరహా చిత్రాల్లో నటించినా ఇంకా కాక తగ్గలేదన్నారు. మరోవైపు బాలయ్య సినిమాల్లోకి రాడు.. రాజకీయాలకే పరిమితం అంటూ గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేశారు. వాటికి సమాధానంగా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో దుమ్ములేపిన విషయం తెలిసిందేగా అన్నారు. ప్రస్తుతం టాక్ షోలలో టాప్ లో ఉందని చెప్పారు. రీసెంట్ గా ‘అఖండ’.. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’తో థియేటర్లు దద్దరిల్లుతాయని తెలిపారు. 

చిత్రంలోని  నటీనటులు చక్కగా నటించారన్నారు.  దునియా విజయ్, హానీరోజ్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుందన్నారు. గోపీచంద్ దర్శకత్వం, థమన్ సంగీతం అదిరిపోయిందని చెప్పారు. అన్ని వర్గాల వారికి నచ్చుతుందని చెప్పారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ తో సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లుతాయని అర్థమవుతోంది. చిత్రం జనవరి 12న రిలీజ్ కి రెడీగా ఉంది. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios