వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు.. నటసింహం విజృంబిస్తుంటే.. కుర్ర హీరోలు భయపడిపోతున్నారు. రీసెంట్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణతో.. స్టార్ హీరోలు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.  

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు.. ఎలా సెట్ అవుతాయో చెప్పడం కష్టం. కొన్ని కొత్త కాంబినేషన్లు అయితే.. అసలు ఊహించలేం కూడా.. అలాంటి కాంబో త్వరలో టాలీవుడ్ తెరపై సందడి చేయబోతుంది. ఆడియన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగించేలా.. నటసింహం బాలయ్య..జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి వార్తలు ప్రస్తుత హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజగా ఉన్నాడు బాలయ్య. రీసెంట్ గా హ్యాట్రిక్ హిట్ సాధించి మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. యంగ్ హీరోలు కూడా బాలయ్య దాటికి విలవిల్లాడిపోతున్నారు. వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటటంతో.. బాలయ్యతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు.. ఈక్రమంలో.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో బాలయ్య బాబు సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి 

ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా బిజీలో ఉన్నాడుసుకుమార్. పుష్ప సినిమా టైమ్ లో కూడా బాలయ్య తో సుకుమార్ సినిమా అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక అప్పుడు మరుగున పడిన వార్తలు..ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. మరోసారి ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

అయితే అటు సుకుమార్ ఇటు బాలయ్య నుంచి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. స్టార్ హీరో బాలయ్య 110వ సినిమాగా సుకుమార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. బాలయ్య సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అంటే బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

సుకుమార్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈలోపు బాలయ్య కూడా తను కమిట్ అయిన రెండు మూడు సినిమాలు కంప్లీట్ చేస్తారట. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలయ్య. నెక్ట్స్ పూరీ జగన్నాథ్ తో సినిమా అంటున్నారు. మరి బాలయ్య ఏం చేస్తారో చూడాలి. స