నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని సార్లు కలిసి ఈవెంట్ లకు హాజరైనా వారి మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చాడు.

కానీ సినిమాపై కామెంట్ చేయకపోవడంతో రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి వేదికపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా మార్చి 1న విడుదల కానుంది.

ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25న హైదరాబాద్ లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ, తారక్ రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాత మహేష్ కోనేరు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.