Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య యాక్షన్‌ వేరే లెవల్‌.. `ఎన్బీకే109` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ ?

బాలయ్య అంటే యాక్షన్‌ సీక్వెన్స్ లతో పూనకాలు తెప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు రూపొందుతున్న `ఎన్బీకే109`లో నెక్ట్స్ లెవల్‌ యాక్షన్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 
 

Balakrishna nbk109 movie crazy update next level action? arj
Author
First Published Jul 22, 2024, 9:11 PM IST | Last Updated Jul 22, 2024, 9:11 PM IST

నందమూరి నటసింహం బాలయ్య సినిమాలంటే యాక్షన్ ఫుల్లుగా ఉండాల్సిందే. బాలయ్య రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అదే సమయంలో అది చూసిన ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే. ఆయన స్టయిల్‌, స్వాగ్‌ ఆ రేంజ్‌లో ఉంటుంది. బాలయ్య సినిమాల్లో అభిమానులు కోరుకునేది పవర్‌పుల్ డైలాగులు, యాక్షన్‌ సీన్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే దర్శకులు సైతం ఆ డోస్‌ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్‌ చేస్తుంటారు. కుదిరితే డోస్ పెంచే ప్రయత్నమే చేస్తారు. 

ఇప్పుడు బాలయ్య నటిస్తున్న `ఎన్బీకే109` సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. ఇందులోనూ ఏమాత్రం యాక్షన్‌ డోస్‌ తగ్గకుండా ప్లాన్‌ చేస్తున్నాడట దర్శకుడు బాబీ. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌లోనూ యాక్షన్‌ దట్టించాడు. సరికొత్త యాక్షన్‌తో గూస్‌ బంమ్స్ తెప్పించారు. ఇప్పుడు దాన్ని మించిన యాక్షన్‌ ప్లాన్ చేస్తున్నారట. ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో షూటింగ్‌ జరుగుతుంది. 

రాజస్థాన్‌లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు. ఇందులో యాక్షన్‌ సీన్లు చిత్రీకరిస్తున్నారట. బాలయ్య, బాబీ డియోల్ మధ్య ఈ యాక్షన్‌ ఉంటుందని తెలుస్తుంది. `యానిమల్‌` సినిమా తర్వాత నెగటివ్‌ రోల్స్ కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు బాబీ డియోల్‌. వరుసగా అనేక ఆఫర్లని ఆయన దక్కించుకున్నాడు. తెలుగులోనే రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఆయన వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. అందులో భాగంగా `ఎన్బీకే 109`లో ఆయన విలన్‌గా చేస్తున్నారు. 

ఇప్పుడు రాజస్థాన్‌ షెడ్యూల్‌లో బాలకృష్ణ, బాబీ డియోల్‌ మధ్య యాక్షన్‌ సీక్వెన్స్ లు తీస్తున్నారు. ఇది వేరే లెవల్‌లో ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఈ యాక్షన్‌ థియేటర్లలో అభిమానులకు ట్రీట్‌ లా ఉంటుందని, గూస్‌బంమ్స్ తెప్పిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇందులో నటించే ఇతర కాస్టింగ్‌, హీరోయిన్‌, వివరాలు తెలియాల్సి ఉంది. టైటిల్‌తోపాటు రిలీజ్‌ డేట్‌పై కూడా ఇంకా క్లారిటీ లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ సంయుక్తంగా దీన్ని తెరకెక్కిస్తున్నాయి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios