బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. `ఎన్బీకే108` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

నందమూరి నటసింహాం బాలకృష్ణ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. `అఖండ`, `వీరసింహారెడ్డి` బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు బాలయ్య. ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌కి సిద్దమవుతున్నారు. అనిల్‌ రావిపూడితో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. `ఎన్బీకే108` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా రిలీజ్‌ డేట్‌ని ఇచ్చింది యూనిట్‌. శ్రీరామనవమి సందర్భంగా ఈ అప్‌డేట్‌ వస్తుందని బాలయ్య ఫ్యాన్స్ ఆశించగా, ఒక్క రోజు ఆలస్యంతో అప్‌డేట్‌ ఇచ్చారు. 

దసరా కానుకగా బాలయ్య సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. `విజయదశమికి ఆయుధపూజ` అంటూ పోస్టర్‌ ని విడుదల చేశారు. ఇందులో బాలయ్య పవర్‌ ఫుల్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇప్పటికే ఉగాదికి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ అదిరిపోయేలా ఉంది. బ్రౌన్‌ డ్రెస్‌లో పెద్ద మనిషిలా బాలయ్య లుక్‌ నెక్ట్స్ లెవల్‌ అనిపించేలా ఉంది. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్‌ సైతం ఆకట్టుకుంటుంది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బాలయ్య కూడా తెలంగాణ స్లాంగ్‌లోనే మాట్లాడబోతున్నారట. 

Scroll to load tweet…

ఇక బాలకృష్ణ మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో, దర్శకుడు అనిల్‌ రావిపూడి మార్క్ వినోదం మేళవింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె బాలయ్య కూతురులా కనిపిస్తుంది టాక్‌. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడం విశేషం. ఇప్పటికే దసరా సందర్బంగా అక్టోబర్‌ 20న రవితేజ `టైగర్‌ నాగేశ్వరరావు`, రామ్‌ బోయపాటి చిత్రాలు విడుదల కానున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు దసరా బరిలో బాలయ్య దిగడంతో రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు.