క్రేజీ కాంబినేషన్.. మహేష్ బాబు దర్శకుడితో బాలయ్య సినిమా.. ?
కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు ఎలా కలుస్తాయో చెప్పడం.. సడెన్ గా సెట్ అయ్యి.. వెండితెరపై క్రేజీ కాంబోలు అవుతుంటాయి. అలాంటి కాంబినేషన్లు సెట్ చేయడంలో బిజీగా ఉన్నాడు బాలయ్య.. ఎవరూ ఊహించని దర్శకుడలతో సినిమాలు చేస్తున్నాడు.

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నటసింహం బాలకృష్ణ. కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తూ.. వరుస విజయాలతో హల్ చ ల్ చేస్తున్నాడు. రీసెంట్ గా హ్యాట్రిక్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. అంతే కాదు.. నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఎవరూ ఊహించని దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మెగా డైరెక్టర్ బాబీతో మూవీని స్టార్ట్ చేశాడు బాలయ్య.. ఈ సినిమా చేస్తూనే..నెక్ట్స్ సినిమా దర్శకుడిని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. ఈక్రమంలో బాలకృష్ణ బాబీ మూవీ తరువాత వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మూవీ చేయబోతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. టాలీవుడ్ భడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారట. వంశీ పైడిపల్లిది సక్సెస్ ట్రాక్ రికార్డ్.. మున్నా తప్పించి ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. చనున్నారని తెలుస్తోంది. మున్నా మినహా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించింది.
ఈ ఏడాది స్టార్ హీరో విజయ్ తో వారసుడు సినిమాను డైరెక్ట్ చేశాడు వంశీ పైడిపల్లి. మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. బాలయ్య వంశీ పైడిపల్లి కాంబో మూవీ అంటే అది ఎలా ఉంటందా అని ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈమూవీపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు.. అధికారికంగా ప్రకటన వస్తే.. ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి... అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. వంశీ పైడిపల్లి జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన బృందావనం ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది. మరి బాలయ్య తో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
బాలయ్య బాబు తో అల్లు అరవింద్.. కూడా సినిమా చేయాల్సి ఉంది. ఈమూవీపై కూడా వర్కౌట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా సూర్య బోయపాటి శ్రీను కాంబోలో ఈ మూవీ వస్తుందంటున్నారు. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ ను కూడా పెద్ద ఎత్తున ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.