`పదహారు భాషల్లో 40 వేలకు పైగా పాటు పాడిన భారతదేశం గర్వించే గాన గంధర్వుడు ఎస్పీ బాలు నిష్క్రమణ యావత్‌ సినీ,సంగీత ప్రపంచానికే తీరిని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలుగాని, నా పాటలు గాని వినని రోజంటూ ఉండదు.

ముఖ్యంగా `భైరవ ద్వీపం`లో ఆయన ఆలపించిన `శ్రీ తుంబర నారద నాదామృతం` పాటని ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రాగాఢ సంతాపం తెలియజేస్తున్నా` అని బాలకృష్ణ తెలిపారు.