గతేడాది డిసెంబర్‌ 2న ఈ చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇంకా థియేటర్లలో సినిమా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కర్నూల్‌లో ఈ చిత్ర శతదినోత్సవ వేడుకని `అఖండ కృతజ్ఞత సభ` పేరుతో నిర్వహించారు. 

`సినిమా రంగం ఒక కుటీర పరిశ్రమ దాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని కోరారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). ఇదే విషయంపై తాము చిత్ర పరిశ్రమ నుంచి చాలా సార్లు ప్రభుత్వాలను వేడుకున్నామన్నారు. సినిమా పరిశ్రమ చాలా గొప్పదన్నారు. `అఖండ`(Akhanda) వంటి చిత్రాల ద్వారా సినీ ఇండస్ట్రీ చాలా గొప్పదనే విషయం నిరూపితమైందన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన చిత్రం `అఖండ`. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటించింది. పూర్ణ, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. 

గతేడాది డిసెంబర్‌ 2న ఈ చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇంకా థియేటర్లలో సినిమా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కర్నూల్‌లో ఈ చిత్ర శతదినోత్సవ వేడుకని `అఖండ కృతజ్ఞత సభ` పేరుతో నిర్వహించారు. చిత్ర బృందం మొత్తంహాజరయ్యింది. ఇందులో బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమని ఇండస్ట్రీగా గుర్తించాలని ప్రభుత్వాలను కోరారు. 

మరోవైపు ఒక సినిమాకి శతదినోత్సవం జరిపి చాలా ఏళ్లు అవుతుందని, ఇప్పుడు `అఖండ`కి ఈ ఈవెంట్‌ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడు ఇలాంటి సినిమా చెయ్యాలి అలాంటి సినిమా చెయ్యాలి అని ఎప్పుడు అనుకోలేదని, సినిమా స్టార్ట్ చేసిన తరువాత కరోనా తో ఇబ్బంది వచ్చింది. అయినా ఎక్కడ వెనుకాడక సినిమా చేశామని, రిలీజ్‌ అయిన సినిమాని ఆడియెన్స్ ని, ఫ్యాన్స్ విశేషంగా ఆదరించారు. కేవలం తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా,ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఈ సినిమాని ఆదరించడం వల్లే ఇంత పెద్ద విజయం సాధించింది. దీని ద్వారా సినిమా గొప్పదనే సందేశాన్ని ఇచ్చారని చెప్పారు బాలయ్య. 

`అఖండ` చిత్రం మర్చిపోతున్న హైందవ, సనాతన ధర్మాన్ని మళ్లీ గుర్తు చేస్తుందని, సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు మంచి సందేశాన్నిచ్చిన చిత్రమిదని తెలిపారు. ప్రకృతి, పిల్లలు, ధర్మం జోలికి వస్తే ఆ భగవంతుడు ఏదో రూపంలో వచ్చి దాన్ని అంతూ చూస్తాడని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించామని తెలిపారు బాలకృష్ణ. ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ వెయ్యి నోళ్ళ ఈ చిత్రాన్ని పొగిడారని, మా యూనిట్ తరుపున , మాకు ఇలాంటి చిత్రంలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు అని తెలిపారు బాలయ్య. 

ఇక తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయిన బాలయ్య.. `చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మా సినిమాలు మాకే పోటీ` అని చెప్పారు. `సింహ`, `లెజెండ్‌`, ఇప్పుడు `అఖండ` ఒకదానితో మరోటి పోటీపడ్డాయని చెప్పారు. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రేక్షకులను మరో ప్రపంచం లోకి తీసుకెళ్ళాడని తెలిపారు. అమెరికాలో అయితే తమన్ సంగీతానికి సౌండ్ బాక్సులు కూడా బద్ధలయ్యాయని చెప్పారు. ప్రగ్యాజైశ్వాల్‌,శ్రీకాంత్‌, పూర్ణ, చమ్మక్‌ చంద్ర వంటి ఆర్టిస్టులను బాలయ్య అభినందించారు.

బోయపాటితో సినిమా అంటే `కొట్టే కొట్టే తెచ్చే` అనేలా చర్చలుంటాయని, కథకే ప్రయారిటీ ఇస్తామని, ఖర్చుని పట్టించుకోమని తెలిపారు. కథ సింపుల్‌గా డిస్కషన్‌ జరుగుతుందని, ఇద్దరి మధ్య అలాంటి అండర్‌స్టాండింగ్‌ ఉంటుందని చెప్పారు. మరోవైపు అభిమానులను ఆకాశానికి ఎత్తేశారు బాలయ్య. తన అభిమానులు తనలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. వారి అభిమానం వెలకట్టలేనిదని, నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాంటి అభిమానులు ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు బాలకృష్ణ. `అఖండ` చిత్ర సక్సెస్‌ తెలుగు సినీ పరిశ్రమకు ఒక దిక్సూచిగా నిలిచి పరిశ్రమకి ఊపిరి పోసిందన్నారు.