నందమూరి నటసింహం బాలయ్య సోమవారం రోజు తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్య జన్మదిన వేడుకలు జరిగాయి. చిన్న పిల్లల మధ్య బాలయ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తన వయసు గురించి సరదాగా స్పందించారు. 

నా పుట్టిన రోజున అందరి నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అందరికి వయసు పెరుగుతోంది.. నాకు మాత్రం తగ్గుతోంది అని బాలయ్య చమత్కరించారు. తనకు వయసు తగ్గుతున్నందుకు కూడా విష్ చేయాలని కోరాడు. ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండవసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ 105వ చిత్రం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం గురించి అన్ని విషయాలు వెల్లడికానున్నాయి. మరోవైపు బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో కూడా ఓ చిత్రం తెరకెక్కాల్సి ఉంది.