నందమూరి బాలకృష్ణ తన ప్రెస్టీజియన్ ప్రాజెక్టు అయిన తన తండ్రి బయోపిక్ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఊహించలేదు. భాక్సాఫీస్ దగ్గర ఆయన చిత్రాలు ఏవీ ఇంత తక్కువ కలెక్షన్స్ వసూలు చేయలేదు. మొదట పార్ట్ లో విషయం లేదని పోయిందని అనుకుంటే రెండో పార్ట్ మహానాయకుడు అంతకన్నా మహా దారుణం ఫలితం మిగిల్చింది. ఈ నేపధ్యంలో బాలయ్య అసలు ఈ ప్లాఫ్ కు కారణం ఏంటనేది పోస్ట్ మార్టం చెయ్యాలని ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారట.

అందుకోసం ఆయన తన అభిమాన సంఘాల వాళ్లతో మీటింగ్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాల వారి అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ కు పిలుపులు వెళ్తున్నాయని తెలుస్తోంది. అలాగే ఆ మీటింగ్ కు తన వెల్ విషర్స్ అయిన కొంతమందిని కూడా ఆహ్వానిస్తున్నారట. తను ఎంతో నమ్మి చేసిన బయోపిక్ ని ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారట. డబ్బులు పోయినందుకు కాదు...తన తండ్రి పేరుతో తీసిన సినిమా ఫెయిల్ అవటం ఆయన్ని ఆవేదన కు గురి చేస్తోందిట.

ఇప్పటికి బాలయ్య..సినిమా లో ఏ లోపాలు లేవని, క్రిష్ తను ఏదైతే అనుకున్నామో అదే తీసారని నమ్ముతున్నారట. దాంతో తన ఆలోచనలోనే పొరపాటు ఉందా..అసలు ఏం చేస్తే బయోపిక్ ఇంకా బాగుండేది అని అడుగుదామనుకుంటున్నారట. త్వరలోనే హైదరాబాద్ లో ఈ మీటింగ్ జరగనుందని అంటున్నారు. 

అయితే సినిమా ఫెయిల్యూర్ అయ్యాక ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడటం ఎందుకు అని వారిస్తున్నారట. అయినా బాలయ్య పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. మంచిదేగా అభిమానులు అసలు ఏం కోరుకుంటున్నారు తన నుంచి అని తెలుసుకోవటం.