NBK 107: బాలయ్య-గోపీచంద్‌ మలినేని సినిమా ముహూర్తం ఫిక్స్..

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఓపెనింగ్‌కి సంబంధించిన ముహూర్తం డేట్ ని ఫిక్స్ చేశారు.

balakrishna gopichand malineni combo film NBK 107 muhartham date

బాలకృష్ణ(NBK) జోరు పెంచుతున్నారు. సినిమా ప్రొడక్షన్‌లో ఉండగానే మరో సినిమాకి రెడీ అవుతున్నారు. తాజాగా Balakrishna మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni)తో బాలయ్య ఓ సినిమా చేసేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. `NBK 107` వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించిన బోతున్న ఈ సినిమాని ఈ నెల 13న శనివారం ప్రారంభించబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శనివారం ఉదయం 10.26నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్‌(Shruti Haasan) హీరోయిన్‌గా ఎంపికైంది. బాలయ్యతో శృతి జోడికట్టడం ఇదే ఫస్ట్ టైమ్‌. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక పూర్తి మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు గోపీచంద్. ఇందులో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. బాలయ్య పూర్తి కొత్త రకమైన పాత్ర చేయబోతున్నట్టు టాక్‌. 

గోపీచంద్ మలినేని ఇటీవల `క్రాక్‌` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా కరోనా సమయంలోనూ విడుదలై మంచి విజయం సాధించింది. మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. పరాజయాల్లో ఉన్న రివితేజకి మంచి విజయాన్ని అందించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. మరోవైపు గోపీచంద్‌ మలినేనికి కూడా మంచి రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాని ప్రత్యేకంగా చూసిన బాలకృష్ణ ఇంప్రెస్ అయ్యారు. దీంతో వెంటనే దర్శకుడు గోపీచంద్‌ని కథని సిద్ధం చేసుకోమని చెప్పాడు. దీంతో వెంటనే గోపీచంద్‌మలినేని కథని సిద్ధం చేయడం, బాలయ్యకి వినిపించడం ఆయనకు నచ్చి ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఏకంగా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. 

also read: బాలయ్య,అనీల్ రావిపూడి చిత్రం టైటిల్ తో పాటు మరో షాకింగ్ న్యూస్

ప్రస్తుతం బాలకృష్ణ .. `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. `సింహా`, `లెజెండ్‌` తర్వాత మూడోసారి ఈ కాంబినేషన్‌లో `అఖండ్‌` రూపొందుతుంది. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. ఇందులో బాలయ్య అఘోరగా, ఊరుపెద్ద మనిషిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ లు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక సినిమాని డిసెంబర్‌ 2న విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

also read: హాట్ న్యూస్: ‘అఖండ’రిలీజ్ డేట్ ఫిక్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios