శ్రియకి ఆఫ‌ర్ ఇచ్చిన బాల‌య్య‌

balakrishna give   bumper  offer to sriya
Highlights

  •  గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ హిట్ ఆనందంగా ఉన్న న‌టి శ్రియ‌
  • చాలాకాలం గ్యాప్‌ తర్వాత బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో న‌టించిన శ్రియ‌
  • ఇంకోసారి శ్రియకి తన సినిమాలో ఛాన్స్‌ ఇవ్వబోతున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌

 

ప్రస్తుతం శ్రియ మళ్ళీ టాలీవుడ్‌లో డిమాండ్‌ వున్న హీరోయిన్‌ అయిపోతోంది. దానిక్కారణం, ఆమె అందుకుంటున్న విజయాలే కావొచ్చు. ఇదిలా వుంటే, బాలకృష్ణ ఇంకోసారి శ్రియకి తన సినిమాలో ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడట. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా సమయంలోనే, 'ఈసారి కమర్షియల్‌ సినిమా మనం చేయబోతున్నాం..' అని హామీ ఇచ్చాడట శ్రియకి. 

నయనతారతో 'శ్రీరామరాజ్యం', 'సింహ' సినిమాల్ని చేసిన బాలకృష్ణ, 'లెజెండ్‌', 'లయన్‌' సినిమాల్ని రాధిక ఆప్టేతో చేసిన విషయం విదితమే. ఇప్పుడు శ్రియకీ, వెంట వెంటనే బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్‌ దక్కిందని తెలుస్తోంది. అయితే అది 'రైతు' సినిమాయేనా.? కాదా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఎందుకంటే, 'రైతు' కాస్త కన్‌ఫ్యూజన్‌లో పడింది. మొత్తమ్మీద, కొత్త ఇన్నింగ్స్‌లో శ్రియ దూకుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

loader