Asianet News TeluguAsianet News Telugu

Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ రెండో రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

భగవంత్ కేసరి.. చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని వసూళ్ల పరంగానూ అదరగొడుతోంది. తాజాగా రెండో రోజు వసూళ్లను వెల్లడించారు మేకర్స్.
 

Balakrishna Bhagavanth Kesari Day 2 World Wide Collections  official NSK
Author
First Published Oct 21, 2023, 11:34 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’ 
(Bhagavanth Kesari).  ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ రెండ్రోజుల కింద (అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజే ఈ చిత్రానికి ఆడియెన్స్  నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీలో చూపించిన ఎమోషన్, యాక్షన్, కామెడీ, మహిళా సాధికారిత అంశాలు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో  సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. 

ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం దుమ్ములేపుతోంది. 
Bhagavanth Kesari  Collections మొదటి రోజు అదిరిపోయిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ32.33 కోట్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్  ప్రకటించారు. ఇక  తాజాగా రెండో రోజు కలెక్షన్లు కూడా సాలిడ్ గానే అందుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం రెండు రోజుల్లో మొత్తంగా రూ.51.12 కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. వీకెండ్ వచ్చేసరికే ఈ చిత్రం యాభై కోట్లు వసూళ్లు చేసింది. టాక్ అదిరిపోవడంతో శని, ఆది వారాల్లో మరింతగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రాన్ని దసరా విన్నర్ గా ప్రకటించారు. దసరాకు విడులైన చిత్రాల్లో ‘భగవంత్ కేసరి’కి మంచి రెస్పాన్స్ దక్కడం. ఇక మున్ముందు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్ ను అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీలా కూతురు పాత్రలో అదరగొట్టింది. నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ గా మెప్పించారు. థమన్ సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios