బాలయ్య బాబు బీబీ3 ఫస్ట్ రోర్ తో  ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  మూడో సినిమా ఇది. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ తెగ వైరల్ అవుతోంది. ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

అరవై నాలుగు సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ ఇప్పటికే దాదాపు ఏడు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్ స్థానంలో కొనసాగుతోంది. బీబీ3 ఫస్ట్‌ రోర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. బాలయ్య కూడా టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

 ‘మా కాంబినేషన్‌(బాలయ్య-బోయపాటి) గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్‌ ఇది మూడో చిత్రం. అయితే ఇది మూడో చిత్రం అని ఎక్కడా టెన్షన్‌ తీసుకోవడం లేదు. హిట్‌ కాకుండా ఎక్కడికి పోతుంది ఈ సినిమా అన్నారు.