`బాహుబలి` మూవీ ఇండియన్ సినిమా రికార్డులను షేక్ చేసింది. సరికొత్త సంచలనం సృష్టించింది. అయితే బాలయ్యతో బాహుబలి చేస్తానంటున్నాడు రానా.
రాజమౌళి రూపొందించిన `బాహుబలి` సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని ప్రపంచం నమ్ముతున్న నేపథ్యంలో కాదు తెలుగు సినిమా ఉందని చాటి చెప్పింది. ఇండియన్ సినిమాకి తెలుగు ప్రాతినిథ్యం వహించేలా చేసింది.
రాజమౌళి అద్భుత సృష్టికి,బాహుబలిగా ప్రభాస్ నటనకు, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణల అద్భుతమైన నటనకు ఈ మూవీ నిదర్శనంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది 1800కోట్ల వసూళ్లని రాబట్టింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా `బాహుబలి 2` నిలిచింది. ఇందులో ప్రభాస్, మహేంద్ర బాహుబలిగా, అమరేంద్ర బాహుబలిగా నటించారు.
ఇదిలా ఉంటే రానా మరోసారి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఏకంగా బాలకృష్ణతో సినిమా చేస్తానని వెల్లడించడం విశేషం. తాను దీనికి దర్శకత్వం వహిస్తాడట. తాజాగా ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకి ఏం జరిగింది? ఈ వార్తలకి మూలం ఏంటనేది చూస్తే, రానా.. ప్రదీప్ మాచిరాజు జీ తెలుగులో హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోకి హాజరయ్యాడు. ఇందులో అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ కాకుండా ఎవరితో సినిమా చేస్తావనే ప్రశ్న రానాకి ఎదురయ్యింది.
దీనికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకీ ఇలా నాలుగు ఫోటోలు వచ్చాయి. వీరిలో బాలకృష్ణని ఎంచుకున్నాడు రానా. బాలయ్యతో అమరేంద్ర బాహుబలి చేస్తానని తెలిపారు. అయితే కారణం కూడా చెప్పాడు. బాలయ్యకి ఈ పూరణాలపై మంచి పట్టు ఉందని, ఆ పాత్రకి ఆయనైతే బాగా సూట్ అవతాడని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జస్ట్ ఫన్నీ వేలో ఈ విసయాన్ని తెలిపారాయన. ఈ వీడియో గతంలో చేసింది. ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. ఇక ప్రస్తుతం రానా `నేనే రాజు నేనే మంత్రి` సీక్వెల్‌లో నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
