ఓ పవర్‌ఫుల్‌ వీడియో ద్వారా ఎన్బీకే 108 ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో బాలకృష్ణ యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. 

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) మరో సినిమాని ప్రకటించారు. అనిల్‌ రావిపూడి(Anilravipudi)తో ఆయన చేయబోతున్న సినిమాని అధికారికంగా ప్రకటించారు. గురువారం సాయంత్రం ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు దర్శక, నిర్మాతలు. రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ(ఎన్బీకే) నటిస్తున్న 108(NBK108)వ చిత్రమిది. దీనికి మ్యూజికల్‌ సెన్సేషన్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ పిక్చర్స్ నిర్మిస్తుంది. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు. 

ఓ పవర్‌ఫుల్‌ వీడియో ద్వారా NBK 108 ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో బాలకృష్ణ యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అదే సమయంలో తుపాకి పట్టుకుని కనిపించడం ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. తుపాకి కాల్పుల మోత హోరెత్తిస్తుంది. అయితే ఇందులో జస్ట్ హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతల కొలాబరేషన్‌ గురించే ప్రకటించారు గానీ, సినిమా ఎప్పట్నుంచి ప్రారంభమవుతుందనే వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే మరో మాస్‌ జాతర స్టార్ట్ కాబోతుంది సిద్ధమవ్వండనే సిగ్నల్స్ ఇచ్చారని చెప్పొచ్చు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి ఫస్ట్ టైమ్‌ పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నారు. తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేయబోతున్నట్టు ఆయన ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు ఈ చిన్న వీడియో క్లిప్‌లో హింట్‌ ఇచ్చారని చెప్పొచ్చు. దీంతో కేవలం అనౌన్స్ మెంట్‌నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. మాస్‌కి, యాక్షన్‌కి కేరాఫ్‌గా నిలిచే బాలయ్య ని అనిల్‌ రావిపూడి ఏ రేంజ్‌లో చూపిస్తారనేది ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

Scroll to load tweet…

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్బీకే 107లో నటిస్తున్నారు. `క్రాక్‌` ఫేమ్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, దునియా విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ లో బాలయ్య విశ్వరూపం చూపించారు. సినిమాపై అంచనాలను పెంచారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని దసరాకి విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.