నందమూరి హీరోల్లో నెం1గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్న బాలకృష్ణ ఎన్టీఆర్ ని కాదని రానాను ఎంచుకున్న బాలయ్య
టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని వరుస విజయాలతో దూసుకెళ్తున్న నటుడు ఎన్టీఆర్. తారక్ కి.. సినిమా అంటే ఎంత ప్రాణమో.. కుటుంబం అన్నా అంతే ప్రాణం. సందర్భం వచ్చిన ప్రతిసారీ.. తనకు తన కుటుంబంపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తన తండ్రి హరికృష్ణ, అన్న కళ్యాణ్ రామ్ గురించి మాత్రమే కాకుండా.. బాబాయి బాలకృష్ణ మీద ఉన్న అభిమానాన్ని కూడా చాటుతూ ఉంటాడు.
అయితే..ఎన్టీఆర్ త్రిపాత్రాభినం చేసిన ‘జై లవ కుశ’ చిత్రం గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాని బాలకృష్ణ చూశారని.. సినిమా బాగుందని చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై స్పందించిన తారక్.. బాలకృష్ణ సినిమా చూడలేదని చెప్పారు. విడుదల తర్వాత చూస్తారేమో అని చెప్పారు.
అయితే బాలయ్య చూడకపోవడానికి కారణం ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలా సార్లు బాలకృష్ణ గురించి ప్రస్తావించారు. మొన్నటికి మొన్న ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బాలయ్య డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. కానీ.. బాలయ్యబాబు మాత్రం.. తారక్ ప్రస్తావన తీసుకురారు. తన మూవీ ప్రమోషన్స్ కి కూడా ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ని కాదని, రానా ప్రోగ్రాం నెం.1 యారి ని ఎంచుకున్నారని టాక్. బాలయ్యకి జూనియర్ అంటే కోపం ఎక్కవని అందుకే అలా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
