Asianet News TeluguAsianet News Telugu

ఆ యంగ్ డైరక్టర్ ని పిలిచి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య?

బాలకృష్ణతో సినిమా కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి నుంచి కోటి రూపాయల అడ్వాన్స్ చాలా అంటే చాలా కాలం కిందటే అందుకున్నాడని ప్రచారం జరుగుతోంది. 

Balakrishna and Prashanth Varma Film on Cards?
Author
First Published Jan 16, 2023, 12:33 PM IST


బాలయ్యకు నచ్చితే తలపై పెట్టుకుంటారంటారు . అయితే ఆయన అభిమానం చూరగొనాలంటే ఆషామాశి కాదు. తాజాగా ఆయన వీరసింహారెడ్డితో ఈ సంక్రాంతికు మన ముందుకు వచ్చారు. నెక్ట్స్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యలో మరో యంగ్ డైరక్టర్ పనితీరు నచ్చి, పిలిచి మరీ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ వర్మ.

కథనే నమ్ముకుంటూ ఇంట్రస్టింగ్  కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడంలో ముందున్నాడు ప్రశాంత్ వర్మ. కేవలం సినిమాలకు మాత్రమే కాక మరో వైపు యాడ్ ఫిల్మ్స్ కి కూడా ప్రశాంత్ వర్మ ని కూడా దర్శకుడిగా ఎన్నుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 మొదలు అవకముందు ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో కి దర్శకత్వం వహించింది కూడా ప్రశాంత్ వర్మ నే. అప్పట్లో ఆ ప్రోమో బిగ్ బాస్ కి బాగానే హైప్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ వర్క్ తో బాగా ఇంప్రెస్ అయిన ఆహా వీడియో వారు "అన్‌స్టాపబుల్" టాక్ షో కి దర్శకత్వం వహించడం కోసం ప్రశాంత్ వర్మ ని ఎంపిక చేసుకున్నారు. అదీ బాగా క్లిక్ అయ్యింది. అప్పుడే బాలయ్య కళ్లల్లో పడ్డారు.

ఆ మధ్యనే "అన్‌స్టాపబుల్" ప్రోమో కి సంబంధించిన షూటింగ్ జరిగింది. ఆ టాక్ షో ప్రోమో కి దర్శకత్వం వహించింది కూడా ప్రశాంత్ వర్మనే. ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనే క్యాప్షన్ తో త్వరలోనే ఆహా యాప్ లో విడుదల అయ్యింది.  ఆ రెస్పాన్స్, ప్రశాంత్ వర్మ వర్క్ పట్ల డెడికేషన్ చూసి కథ తెచ్చుకోమని చెప్పారట బాలయ్య.వెంటనే తన దగ్గగర ఉన్న ఓ బెస్ట్ కథతో బాలయ్యను ఎప్రోచ్ అవటం..ఆయన ఇంప్రెస్ అవటం జరిగిపోయాయట.  త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.  బాలకృష్ణతో సినిమా కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి నుంచి కోటి రూపాయల అడ్వాన్స్ చాలా అంటే చాలా కాలం కిందటే అందుకున్నాడని ప్రచారం జరుగుతోంది. 

ఎస్ ఎల్ వి సినిమా బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించనున్నారని సమాచారం. ఇది చాలా ప్రెస్టేజియస్ ఫిల్మ్ అవుతుందని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలు కానుంది. మరో ప్రక్క బోయపాటి దర్శకత్వంలో ఓ పొలిటికల్ చిత్రానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది 2024 సమ్మర్ కు రెడీ అవుతుంది. ఇక సినిమాల పరంగా చూస్తే తేజ సజ్జ హీరో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "హను మ్యాన్" అనే మొట్టమొదటి తెలుగు సూపర్ హీరో సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు ప్రశాంత్ వర్మ.
 

Follow Us:
Download App:
  • android
  • ios