భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను రజతం సాధించిన సందర్బంగా ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ తారలు. తాజాగా బాలకృష్ణ, మహేష్‌బాబు మీరాబాయి విజయాన్ని ప్రశంసించారు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను రజతం సాధించిన విషయం తెలిసిందే. ప్రారంభంలోనే రజతంతో ఒలింపిక్స్ లో భారత్‌ శుభారంభాన్నిచ్చిందని చెప్పొచ్చు. దీంతో దేశం గర్విస్తోంది. మీరాబాయి చాను సాధించిన విజయంలో దేశ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్బంగా ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సినీ తారలు సైతం విషెస్‌ చెబుతున్నారు. తాజాగా బాలకృష్ణ, మహేష్‌బాబు మీరాబాయి విజయాన్ని ప్రశంసించారు. బాలకృష్ణ ఫేస్ బుక్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. `టోక్యో ఒలింపిక్స్ లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో కష్టపడి సిల్వర్‌ సాధించిన మీరాబాయి చానుకి హృదయ పూర్వక అభినందనలు. మనం ఎప్పటికీ ఎంతో ఆదరించే క్షణం. ఆమె అద్భుతమైన విజయంతో దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంకా మరిన్ని పతకాలు మనకు రాబోతున్నాయి` అని తెలిపారు. 

మరోవైపు మహేష్‌బాబు సైతం స్పందించారు. `భారతీయ జెండా ఎగరడం ప్రారంభమైంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన మీరాబాయి చానుకి నా తరపున పెద్ద అభినందనలు. యాక్షన్‌(గేమ్‌) ఇప్పుడే ప్రారంభమైంది` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. 

Scroll to load tweet…