బాలకృష్ణ, బోయపాటి. ఇద్దరు కలుస్తున్నారంటే బాక్సాఫీస్ కు పూనకం వస్తుంది. గత పుష్కర కాలంలో ఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్.


 బాలకృష్ణ, బోయపాటి. ఇద్దరు కలుస్తున్నారంటే బాక్సాఫీస్ కు పూనకం వస్తుందనేది ప్రూవైన నిజం. గత పుష్కర కాలంలో ఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. పైగా బాలకృష్ణ ఎప్పుడు ఫ్లాపుల్లో ఉన్న బోయపాటితో సినిమా చేసి బయట పడతాడని చరిత్ర చెప్తోంది. రెండేళ్ళ క్రితం ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే కరోనాతో భయంగా ఉన్న టైమ్ లోనూ ఈ ఇద్దరి కాంబినేషన్ చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టారు.

నందమూరి బాలకృష్ణ మొన్న సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రెస్పాన్స్‌తో ఊపుతెచ్చుకున్న ఈ సీనియర్ హీరో తాను మళ్లీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. 2010లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సింహా’తో వీరి కలయిక మొదలైంది. ‘లెజెండ్’ వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం. ‘అఖండ’ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో సూపర్ హిట్ కు రంగం కానుంది. జూలై ఫస్ట్ వీక్ లో ప్రకటించే అవకాసం ఉంది. అయితే ఈ సారి సినిమాలో బోయపాటి ఎలాంటి స్క్రిప్టుని రెడీ చేసారు... 

చాలా మంది ఈ చిత్రం అఖండ 2 అనుకుంటున్నారు. ఆ మేరకు మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం . అఖండ క్లైమాక్స్ లో సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు బోయ‌పాటి. దాంతో. అందరు ఈ సారి ఈ కాంబోలో వచ్చేది అఖండ 2 అనే అనుకొంటున్నారు. కానీ ఇది అఖండ 2 కాద‌ట‌. లెజెండ్ కి సీక్వెల్ గా ఈ క‌థ ఉండ‌బోతోంద‌ని మీడియా వర్గాల సమాచారం. లెజెండ్ లో పొలిటికల్ మేటర్స్ చాలా ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో ఎం.ఎల్.ఏ ల‌ను పిలిపించి.. బాలయ్య ఓ రేంజిలో క్లాస్ పీకే సీన్ ఒక‌టుంది. పొలిటికల్ సైటర్సే తో సాగే ఆ సీన్ నుంచే.. ఇప్పుడు కొత్త క‌థ ప్రారంభం మొదలెట్టబోతున్నారట‌. 2024 ఎన్నిక‌ల ముందు ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న‌ది బాలయ్య ఆలోచన.

 ఈసారి అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాలయ్య, బోయపాటి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి పనికొచ్చేలా ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ సినిమా చేయాలని బాలయ్య భావించటంలో వింతేముంది.