‘జైసింహా’ హిట్‌తో జోష్ మీదున్న బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. రెగ్యులర్ షూట్‌కు ఇంకా కొన్నినెలలు పట్టే ఛాన్స్ ఉండడంతో ఈలోగా ఓ మూవీ సెట్స్ కు తెచ్చే ప్లాన్ జరుగుతోందని సమాచారం. ఇంతకుముందే ‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’ డైరెక్టర్ అనిల్ రావిపూడి..బాలయ్య కు ఓ కధ వినిపించాడని వార్తలు వచ్చాయి.
అదిప్పుడు సెట్స్ కు వెళ్లనుందని.. జైసింహా సినిమా నిర్మాత సి కళ్యాణ్ ఈ మూవీ నిర్మిస్తాడని టాక్. ‘ఇంటెలిజెంట్’ తో భారీగా నష్టపోయిన కళ్యాణ్ మళ్ళీ వినాయక్ – బాలకృష్ణ కాంబో సెట్ చేయాలనీ అనుకున్నా సరైన స్క్రిప్ట్ లేదని వినాయక్ వెనకడుగు వేయడంతో అనిల్ తో ఈ మూవీ కన్ఫర్మ్ అయిందని వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ అయ్యేలోగా ఈమూవీ పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.