Asianet News TeluguAsianet News Telugu

'అమ్మ మొగుడు' డైలాగు వాళ్లను ఉద్దేశించా?

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో అమ్మ మొగుడు అనే పదం వాడటం వెనక రీజన్స్ వెతుకుతున్నారు.

Balakrishna  Amma Mogudu dialogue goes viral
Author
Hyderabad, First Published Jun 11, 2020, 8:56 AM IST

బాలయ్య నోరు విప్పి మాట్లాడే మాటలే వైరల్ అయ్యిపోతూంటాయి. అలాంటిది ఓ పవర్ ఫుల్ డైలాగుని చెప్తే ఇంకెలా ఉంటుంది. వైరల్ కా బాప్ అనాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. బాలయ్య, తాజాగా తను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ను వదిలారు. ఈ టీజర్‌ ఎలా ఉంది? అనేకన్నా అందులో చెప్పిన డైలాగు ఎవరిని ఉద్దేశించి అని డిస్కషన్స్ మొదలెట్టారు.  

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో అమ్మ మొగుడు అనే పదం వాడటం వెనక రీజన్స్ వెతుకుతున్నారు.

రకరకాల కారణాలతో బాలయ్య ఎప్పుడూ న్యూస్ లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైలాగు ఆయన తన ప్రత్యర్దులపై వేసిన కౌంటర్ ఎటాక్ గా చెప్తున్నారు. కొందరు ఈ టీజర్ ద్వారా బాలయ్య మెగా బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేసాడంటూంటే, మరికొంతమంది..కొడాలి నాని రెగ్యులర్ గా వాడే అమ్మ మొగుడు ని గుర్తు చేస్తూ ఈ డైలాగు పెట్టాడంటున్నారు. ఎవరేమనుకున్నా..బాలయ్య చెప్పిన ఈ డైలాగు మరికొంతకాలం అయితే వార్తల్లో ఖచ్చితంగా ఉంటుంది ఏమంటారు.
 
ఇక  సింహ, లెజెండ్‌ తర్వాత బోయపాటి శ్రీను, బాలకష్ణల కాంబినేషన్‌ లో వస్తున్న మూడో చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. టీజర్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ఒక ఫైట్‌కి సంబంధించిన ఎపిసోడ్‌.. ఆ తర్వాత డైలాగ్‌.. ఇలా టీజర్‌ కట్‌ చేశారు. 

దీనికి థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాములుగా లేదు. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా బిబి3 (బాలకష్ణ-బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios