Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌ స్పాట్‌లో గాయపడ్డ బాలకృష్ణ

ఈ షో ప్రోమో చేస్తుండగా... బాలకృష్ణకు కాలికి తీవ్రంగా గాయమైనట్లు సమాచారం. అయినా.. ప్రోమో షూట్ కోసం బాలయ్య అలాగే షూటింగ్ కంప్లీట్ చేసారట. షూటింగ్ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే అధికారికంగా ఈ విషయమై సమాచారం ఏమీ లేదు.
 

Balakrishna accident in Shooting spot
Author
Hyderabad, First Published Oct 9, 2021, 4:16 PM IST

 బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమో ఈ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేసారు. ఈ ప్రోమోను క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ షో ప్రోమో చేస్తుండగా... బాలకృష్ణకు కాలికి తీవ్రంగా గాయమైనట్లు సమాచారం. అయినా.. ప్రోమో షూట్ కోసం బాలయ్య అలాగే షూటింగ్ కంప్లీట్ చేసారట. షూటింగ్ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే అధికారికంగా ఈ విషయమై సమాచారం ఏమీ లేదు.

ఇక  ఈ  షోకు ‘అన్‌స్టాపబుల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కు మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు గెస్ట్‌గా హాజరు కానున్నారు.   బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న అఖండ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా వీడ్కోలు పార్టీ కూడా నిర్వహించింది.  షూటింగ్ పూర్తి కావడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్ని ముమ్మురం చేసింది. ఈ  సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలో అఖండ టీమ్ ఈ విషయంలో ఓ ప్రకటన చేయనుంది.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన “అఖండ” సినిమా ఆంధ్రాలో టికెట్ రేట్ల వ్యవహారం వంటి కారణాల వల్ల ఇప్పటివరకు  చెయ్యలేదు.అయితే, ఇంకా ఎక్కువకాలం సాగతీస్తే… రిలీజ్ డేట్స్ దొరకడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో దీపావళికి విడుదల చెయ్యాలని నిర్మాత భావిస్తున్నారని సమాచారం. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఒప్పుకున్నారు. 

మరో ప్రక్క డిసెంబర్ లో “పుష్ప”, “ఆచార్య” సినిమాలు, సంక్రాంతికి “ఆర్ ఆర్ ఆర్”, రాధేశ్యామ్ పోటీలో ఉన్నాయి. ఈ ఏడాది డేట్ మిస్ చేసుకుంటే మళ్ళీ 2022 వేసవి వరకు ఆగాలి. సో.. దీపావళి వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట బయటికి వచ్చింది. తమన్ స్వరపరిచిన రొమాంటిక్ డ్యూయెట్ అది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ పై తీశారు. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ నెల రోజుల పాటు తీశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios