Balakrishna 108 Movie Heroine: బాలయ్య 108 కి హీరోయిన్ ను ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి, నాలుగోసారి కూడా ఆమే
బాలయ్య మూవీపై గట్టిగా ఫోకస్ పెట్టాడు అనిల్ రావిపూడి. షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు చాలా విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక బాలకృష్ణ జోడీగా హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశాడట.
టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య.. ఆతరువాత అనిల్ రావిపూడితో సెట్స్ ఎక్కబోతున్నాడు, ఇక ఎన్‌బీకే 107 ప్రాజెక్టు షూటింగ్ పూర్తి కాగానే..వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్‌బీకే 108 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సబంధించిన చాలా విషయాల్లో షూటింగ్ కు ముందే క్లారిటీ ఇవ్వాలి అని చూస్తున్నాడు అనిల్
ఈ సినిమాలో బాలకృష్ణలోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నట్టు ముందే చెప్పాడు అనిల్ రావిపూడి. అంతేకాదు పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ఈసినిమాలో బాలకృష్ణ కూతురిగా కనిపించనుందని ఓ క్రేజీ అప్‌డేట్ కూడా ఇచ్చేశాడు. మరి ఈసినిమాలో హీరోయిన్ ఎవరు...? సీనియర్ హీరో సరసన హీరోయిన్ గా నటించబోయే బ్యూటీ ఎవరు అనే విషయంలో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
తాజాగా ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ తెరపైకి వచ్చింది. పంజాబీ భామ మెహరీన్‌కౌర్ ఎన్‌బీకే 108లో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలా వరుస సినిమాల్లో నటించింది మెహరీన్. ఇక నాలుగో సారి అది కూడా సీనియర్ హీరో బాలయ్య బాబు సరసన నటించడానికి అనిల్ మెహరీన్‌ను ఒప్పించినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు టీమ్.
ఇక ఈ మూవీలో బాలకృష్ణ 50 ఇయర్స్ వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ప్రస్తుత వయస్సు కంటే పదేళ్లు తక్కువ ఏజ్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సిల్వర్ స్క్రీన్‌పై మెహరీన్-బాలకృష్ణ కాంబినేషన్ నిజమైతే, మెరువడం పక్కా అని అంటున్నారు ఫ్యాన్. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందో అని ఆలోచిస్తున్నారు.