Asianet News TeluguAsianet News Telugu

'అఖండ' మ‌ళ్లీ ఫ్యాన్స్ షోస్ హంగామా

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
 

Balakrishn Akhanda movie fans show
Author
Hyderabad, First Published Nov 24, 2021, 12:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం  'అఖండ' . ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదలకానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ కలిగిన పాత్రలను పోషించగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం డిసెంబ‌రు 1 అర్థ‌రాత్రి ఫ్యాన్స్ షో లు పడే అవకాసం ఉంది.

ఈ మేరకు ఫ్యాన్స్ షోలు వేయించాల‌ని ఫ్యాన్స్  ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో స్పెష‌ల్ షోలు ప‌డాల్సిందే అని ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రభుత్వం కూడా ఓకే చెప్పే అవకాసం ఉందని తెలుస్తోంది. అదే గనుక జరిగితే అఖండ‌తో మ‌ళ్లీ స్పెష‌ల్ షోల హంగామా మొద‌ల‌య్యే అవ‌కాశాలూ క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో రెండు థియేట‌ర్ల‌కు ప‌ర్మిష‌న్ తీసుకుని, స్పెష‌ల్ షో వేయాల‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ‌తంలో బాలయ్య పైసా వ‌సూల్ సినిమాల‌కు స్పెష‌ల్ షోలు ప‌డ్డాయి. అదే సెంటిమెంట్ తో ఈసారీ.. షోలు వేయాల‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే, ప్రీమియ‌ర్ల పేరుతో అయినా స‌రే, అర్థరాత్రి ఆట వేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు‌. అఖండ కు అనుమ‌తులు ఇస్తే.. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ లాంటి మిగిలిన పెద్ద సినిమాల‌కూ ఫ్యాన్స్ షోలు ఖచ్చితంగా పడతాయి.

ఇక చిత్రం విషయానికి వస్తే...ఈ సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువే అని సమాచారం. 2 గంటల 37 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ చేశాడట బోయపాటి. బాలయ్యతో ఇంతకుముందు బోయపాటి రూపొందించిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్’ సైతం అటు ఇటుగా ఈ నిడివితో రిలీజైన చిత్రాలే. ‘సింహా’ రన్ టైం 2 గంటల 36 నిమిషాలు కాగా.. ‘లెజెండ్’ 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్సే  దాదాపు 45 నిమిషాలు సాగుతాయన్ని యూనిట్ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక రోజులు యాక్షన్ సీన్స్ ను షూట్ చేసిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు నెలకొల్పినట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో  ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన గానీ .. 28వ తేదీన గాని వైజాగ్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ భారీ వర్షాలతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ .. ఆ ప్రభావం నుంచి వాళ్లు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోనే శిల్పకళావేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. 

Also read `అఖండ` కోసం అఘోర పాత్రలపై రీసెర్చ్ చేశా.. హీరోలు లేకపోతే మేం జీరోః మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ షాకింగ్ కామెంట్

ప్రగ్యా జైస్వాల్  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. మరో కీలకమైన పాత్రను జగపతిబాబు పోషించాడు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. మొదలైన దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇటీవల ట్రైలర్ లాంచ్ అయ్యాక అంచనాలు మరింత పెంచేసింది.  

Also read ఒంపుసొంపులతో హీట్ పెంచేస్తున్న అనన్య పాండే.. అదరహో అనిపిస్తున్న ఘాటైన పరువాలు
  
 

Follow Us:
Download App:
  • android
  • ios